Samantha : సమంత, నాగ చైతన్యలకు అధికారికంగా విడాకులు వచ్చేది ఎప్పుడు?
samantha : అక్కినేని నాగ చైతన్య మరియు సమంతలు భార్య భర్తలుగా విడిపోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇద్దరు కూడా తాము విడి పోతున్నాం.. ఎన్నో సార్లు ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాం. ఈ నిర్ణయాన్ని ఇద్దరం కలిసి తీసుకున్నాం. పెద్దల సమక్షంలోనే ఈ విషయంపై చర్చ జరిగింది అన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇద్దరు విడి పోయారు అనేది అధికారికం. విడి పోయిన ఇద్దరు కూడా వారి వారి పనులతో బిజీ అయ్యారు. అయితే అధికారికంగా వారు విడి పోయారా.. వారికి కోర్టు విడాకులు ఇచ్చిందా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
వారిద్దరు కూడా మళ్లీ పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా అధికారికంగా విడాకులు తీసుకోవాల్సి ఉంది. ఫ్యామిలీ కోర్టు లో ఇద్దరు కూడా విడాకుల కోసం దరకాస్తు చేసుకుంటే కొన్ని నెలల సమయం ఇచ్చి ఆ తర్వాత వారు ఇద్దరు విడి పోయినట్లుగా కోర్టు అధికారికంగా విడాకులు ఇస్తుంది. ఇది ప్రతి ఒక్కరి విషయంలో జరుగుతుంది. సెలబ్రెటీలు స్టార్స్ కనుక వారికి ఏమీ ప్రత్యేకమైన న్యాయం లేదు. వారు కూడా విడాకులకు అప్లై చేసుకోవాలి.. తద్వార వారు ఫ్యామిలీ కోర్టు లో విడాకులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే వారు ఇద్దరు కూడా కోర్టులో అప్లై చేసి ఉంటారు. కోర్టు ఒక తేదీని నిర్ణయిస్తుంది. వారు ఇద్దరు కూడా ఆ రోజు కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది.

samantha and naga chaitanya divorce news
Samantha : సమంత, నాగచైతన్యల విడాకులు కోర్టులో..
సమంత మరియు నాగ చైతన్యలు అధికారికంగా విడి పోవాలి అంటే కనీసం ఒక్కసారి అయినా కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. కాని ఇప్పటి వరకు వారిద్దరు కూడా కోర్టుకు వెళ్లిన దాఖలాలు లేవు. కనుక ఇద్దరికి కూడా ఇంకా అధికారికంగా విడాకులు రాలేదు అనే టాక్ వినిపిస్తుంది. కోర్టు ప్రత్యేకంగా కరోనా వల్ల వారి విడాకుల కేసును ఆన్ లైన్ ద్వారా ఏమైనా విచారించి విడాకులను మంజూరు చేసి ఉంటుందా అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికి అయితే సమంత మరియు నాగ చైతన్యల విడాకుల వ్యవహారం పై చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటికి కూడా కొందరు అభిమానులు మళ్లీ వీరిద్దరు కలిస్తే బాగుండు.. సమంత మరియు నాగ చైతన్య లు టాలీవుడ్ లోనే బెస్ట్ కపుల్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.