Samantha : పాపం సమంత .. ఆ విషయం తెలిసి ఎక్కి ఎక్కి ఏడుస్తోంది !

Authored By aruna | The Telugu News | Published on: June 13, 2023, 5:00 pm

Samantha : పుష్ప సినిమా తర్వాత సమంత పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ ‘ ఖుషి ‘ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది. దీంతోపాటు హిందీలో ‘ సీటాడెల్ ‘ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ప్రస్తుతం దీని షూటింగ్ సైబీరియాలో జరుగుతుంది. అక్కడ కొన్ని ఫైట్ సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్లలో సమంతా చాలా యాక్టివ్గా పాల్గొంటుంది. అయితే తాజాగా సమంత అక్కడ ఓ పబ్ కి వెళ్లి ఊ అంటావా మావ పాటకి స్టెప్పులు వేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ క్రమంలోనే సమంత యాంటీ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. యశోద, శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంత చాలా నీరసంగా కనిపిస్తూ అనారోగ్యంతో ఉన్నట్లు బిల్డప్ ఇచ్చుకుంది. సింపతి క్రియేట్ చేసుకుని సినిమాలకి ఆడియన్స్ ను రప్పించేలా ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం యశోద సినిమాకి వర్కౌట్ అయింది కానీ శాకుంతలం సినిమాకి వర్కౌట్ అవ్వలేదు. శాకుంతలం రిలీజ్ సమయానికి సమంత చాలా వరకు రికవరీ అయింది. కానీ ఆమె కళ్ళజోడు పెట్టుకొని అన్ ఈజీ గా ఉన్నట్లు మీడియా ముందు కనిపించింది. అప్పుడు సమంత సింపతి డ్రామా ఆడుతూ శాకుంతలం సినిమాని ప్రమోట్ చేసిందని విమర్శలు వచ్చాయి.

Samantha anty fans trolls her about that matter

Samantha anty fans trolls her about that matter

ఇక శాకుంతలం సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇది సమంత కెరియర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ సినిమా అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సమంత సీటాడిల్ వెబ్ సిరీస్ లో నటించేందుకు ఫారిన్ వెళ్ళిపోయింది. అక్కడ ఫుల్ యాక్టివ్ గా కలర్ ఫుల్ డ్రెస్లతో సందడి చేసింది. అప్పటినుంచి సమంతను జనాలు ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా పబ్బులో కనిపించడంతో ఈ ట్రోల్స్ ఇంకా ఎక్కువ అయ్యాయి. ఇక ఖుషి సినిమా సెప్టెంబర్ లో రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం సమంత హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మీడియా నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు సమంత సమాధానం ఇవ్వాల్సిందే.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp