Samantha Quotes About Goodness And Beauty
Samantha : అందాల ముద్దుగుమ్మ సమంత ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్‌గా మారింది. నాగ చైతన్య నుండి విడాకుల తర్వాత సమంత సినిమాలు, స్పెషల్ సాంగ్స్,టాక్ షోలు ఇలా తనకు వచ్చిన అవకాశాలను అంది పుచ్చుకుంటుంది. ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తన ఫామ్ ను మరింత పెంచేసుకుంది. ఒక రకంగా చెప్పాలంటే సుమారుగా దశాబ్ద కాలం గడిచినా కూడా తన ఇమేజ్ ను ఏమాత్రం తగ్గించుకోకుండా స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతుంది.సమంత చాలా మందితో జ్యోవియల్‌గా ఉంటుంది.
సెట్‌లో ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదు. ఆమె క్యారెక్టర్ గురించి తనతో కలిసి నటించిన నటీనటులు కూడా చాలా అద్భుతంగా కొన్ని ఇంటర్వ్యూలలో వెల్లడించారు.. వాళ్లే కాదు సమంతతో రంగస్థలం సినిమాలో కలిసి నటించిన నాగ మహేష్ కూడా ఈమె గురించి కొన్ని ఆసక్తికర కామెంట్లు తెలియజేయడం గమనార్హం. 2018లో సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో సమంత హీరోయిన్ గా నటించగా ఐటమ్ సాంగ్ లో పూజా హెగ్డే మెరిసింది.రంగస్థలం చిత్రంలో సమంతకు తండ్రి పాత్రలో నాగ మహేష్ నటించారు. నాగ మహేష్ మాట్లాడుతూ రంగస్థలం గురించి అందులో సమంత క్యారెక్టర్ గురించి కూడా ఒక విషయం తెలియ జేశాడు..
samantha character to be revealed by character artist
సినిమాలో నేను ఒక సన్నివేశంలో సమంత చేయి పట్టుకున్నప్పుడు.. నేను చాలా మెల్లగా ఆమె చెయ్యి పట్టుకున్నాను. సమంత ఏం పర్వాలేదు గట్టిగా పట్టుకోండి అని అనడంతో వెంటనే నేను ఆశ్చర్యపోయాను.. ప్రొఫెషనల్ గా సమంత తన పాత్రకు న్యాయం చేస్తుందని ఆమె గురించి చక్కగా తెలిపాడు. కొంత మంది చేయి పట్టుకుంటే సీరియస్ అవుతున్నారు. సమంత అలా చాలా ప్రోఫెషనల్‌గా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సమంత హిందీలో, తమిళం, తెలుగు, ఇంగ్లీష్ భాషలలో సినిమాలు చేస్తుంది. త్వరలో శాకుంతలం అనే సినిమాతో పలకరించనుంది.
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
This website uses cookies.