Samantha : పెద్దయ్యాక సమంత అవుతానన్న చిన్నారి.. వీడియో షేర్ చేసిన కీర్తి సురేష్
Samantha : టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ సమంత ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. ఈ ముద్దుగుమ్మ నిత్యం వార్తలలో నిలుస్తుంది. ఆమె చేసే పోస్ట్‌లు, నటించే సినిమాలు సమంత హాట్ టాపిక్ అయ్యేలా చేస్తుంది. అక్కినేని నాగ చైతన్యతో విడాకులు ప్రకటన అనంతరం సమంత తన కెరీర్ మీద దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. వరుస సినిమాలతో బిజీ అయ్యేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తోంది. అయితే మరో పక్క ఆమె ఇన్ స్టాలో మాత్రం ప్రతి రోజూ పోస్ట్‌లు పెడుతూ ఉంటుంది. అయితే సినిమాల అప్డేట్స్ అనే వాటి కంటే ఎక్కువగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలే ఎక్కువ షేర్ చేస్తూ తన బాధ బయట పెట్టె ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో సమంత చర్చనీయాంశంగా మారుతుంది.
సమంతకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం యూత్ మాత్రమే కాదు.. చిన్నారుల్లోనూ డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా మహానటి కీర్తి సురేష్ తన సినిమా షూటింగ్ సెట్ లో ఉండగా.. అక్కడే ఉన్న చిన్నారితో మాటలు కలిపింది. నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అని అడగ్గా.. సమంత అవుతాను అని చెప్పింది. ఆ చిన్నారి సమంతకు వీరాభిమనిని అని చెప్పింది. ఈ వీడియోను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తూ కీర్తి సురేష్.. ” సమంత మీ అభిమాని.. మీరు ఆమెను ఒకసారి కలుసుకోవాలి సామ్ ” అంటూ క్యాప్షన్ ఇచ్చిమది.ఈ వీడియోకు సమంత రిప్లై ఇస్తూ..

samantha die hard fan a girl video viral
Samantha : సమంత ఫాలోయింగే వేరు..!
ఎవరు ఈ క్యూటీ అంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది . కాగా, ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్న సమంత తన జీవితంలో ఎన్ని కష్టాలు పడిందో తాజా ఇంటర్వ్యూలో తెలియజేసింది. అందరు మిడిల్ క్లాస్ అమ్మానాన్నల లాగే వారి కోరిక మేరకు బాగా చదివి టాపర్‌గా నిలిచేదాన్ని అని చెప్పిన సమంత.. పై చదువులకు డబ్బులు లేక చదువు మానేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇక ఈ గ్లామర్ వరల్డ్ లోకి రాక ముందు పెద్ద పెద్ద ఫంక్షన్స్‌కు హాజరయ్యే గెస్ట్‌లకు వెల్‌కమ్ చెప్పే అమ్మాయిగా వెళ్లే దానిని అని చెప్పుకొచ్చారు. 500 రూపాయలకు కూడా పని చేశానంటూ వాపోయింది.
View this post on Instagram