Samantha : ఆ రెండు సినిమాల వల్లే నా జీవితం ఇలా అయింది .. నా తలరాత అలాంటిది… సమంత
Samantha : ‘ ఏ మాయ చేసావే ‘ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన సమంత అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. వ్యక్తిగతంగా సక్సెస్ కాకపోయినా సినిమాల పరంగా జెట్ స్పీడ్ లో దూసుకెళుతోంది. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ తో ప్రేక్షకులను అలరించిన సమంత పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం ఆ క్రేజ్ తోనే పాన్ ఇండియా స్థాయిల్ సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ‘ శాకుంతలం ‘ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఇక ఈ సినిమాను నీలిమ గుణ, దిల్ రాజ్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సమంత ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ యాక్టివ్ గా పాల్గొంటుంది. బాలీవుడ్ లో కూడా జోరుగా ప్రచారం కొనసాగిస్తుంది. అంతకుముందే సమంత బాలీవుడ్లో ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో నటించి హిందీ ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం సీటాడెల్ అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది. అయితే తాజాగా బాలీవుడ్ మీడియా ముందు సమంత ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.
శాకుంతలం సినిమాలోని పాత్ర నేను చేయకుంటే ఎంతో మిస్ అయ్యేదాన్ని. ఈ పాత్ర నాకు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇక ఫ్యామిలీ మెన్, సిటాడెల్ సినిమాలు కంప్లీట్ ఉమెన్ యాక్షన్ గా తెరకెక్కాయి. మనకు తెలిసిందే ఈ రెండు సినిమాలతో సమంతకు బాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించి బాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. దీంతో శాకుంతలం సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా హిట్ అయితే సమంత పేరు ఓరేంజ్ లో మారూమ్రోగిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
