Samantha : ఆ హీరోయిన్ మీద కోపంతోనే స‌మంత అంత దారుణంగా గ్లామ‌ర్ షో చేస్తుందా? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Samantha : ఆ హీరోయిన్ మీద కోపంతోనే స‌మంత అంత దారుణంగా గ్లామ‌ర్ షో చేస్తుందా?

Samantha : టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ స‌మంత గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చూడ చ‌క్కని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు కొల్ల‌గొట్టింది. టాలీవుడ్ అగ్ర క‌థానాయిక‌గా గ‌త 15 యేళ్లుగా స‌త్తా చూపెడోతుంది. ఇన్నేళ్ల కెరీర్‌లో హిట్స్.. ఫ్లాప్స్.. పెళ్లి.. విడాకులు.. ఇలా ఒక సినిమాకు కావాల‌సినంత మసాలా ఉంది. రీసెంట్‌గా ఈ వ్యాధి నుంచి కోలుకొని తిరిగి హీరోయిన్‌గా క‌మ్ బ్యాక్ ఇచ్చింది. నాగ చైతన్య హీరోగా […]

 Authored By ramu | The Telugu News | Updated on :3 June 2024,5:30 pm

ప్రధానాంశాలు:

  •  Samantha : ఆ హీరోయిన్ మీద కోపంతోనే స‌మంత అంత దారుణంగా గ్లామ‌ర్ షో చేస్తుందా?

Samantha : టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ స‌మంత గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చూడ చ‌క్కని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు కొల్ల‌గొట్టింది. టాలీవుడ్ అగ్ర క‌థానాయిక‌గా గ‌త 15 యేళ్లుగా స‌త్తా చూపెడోతుంది. ఇన్నేళ్ల కెరీర్‌లో హిట్స్.. ఫ్లాప్స్.. పెళ్లి.. విడాకులు.. ఇలా ఒక సినిమాకు కావాల‌సినంత మసాలా ఉంది. రీసెంట్‌గా ఈ వ్యాధి నుంచి కోలుకొని తిరిగి హీరోయిన్‌గా క‌మ్ బ్యాక్ ఇచ్చింది. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఏమాయా చేసావే’ మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది సమంత. ఆ మూవీ సక్సెస్ తర్వాత సామ్ వెనుదిరిగి చూసుకోలేదు. ఈ మూవీలో జెస్సీ పాత్రలో సమంత యాక్టింగ్‌ను ఎవరు మరిచిపోలేదు.

Samantha ఆమెపై కోపంతో అలా..

రీ ఎంట్రీ తరువాత సమంతకు తెలుగు సినిమా అవకాశాలు రాలేదని అంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఏడాది పాటు విరామం తీసుకుంటే ఆ గ్యాప్‌లో చాలా మంది కొత్త నటీమణులు పుట్టుకొస్తారు. సమంత విషయంలో కూడా అలాగే జరిగింది. అందుకే ఇప్పుడు ఆమెకు ఆఫర్లు కూడా తక్కువే వస్తున్నాయి అంటున్నారు. ప్రస్తుతం తన సొంత బ్యానర్‌లో ఓ సినిమా చేస్తోంది సామ్. అలాగే ఒక వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇక అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లోని తదుపరి చిత్రంలో సామ్ కథానాయిక అంటూ వార్తలు విన్పిస్తున్నాయి. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పుడు సినిమా చేయాలనుకున్నా తెలుగు స్టార్ హీరోలెవరూ సపోర్ట్ చేయలేదని సమంత అన్నట్టుగా టాక్ నడుస్తోంది.

Samantha ఆ హీరోయిన్ మీద కోపంతోనే స‌మంత అంత దారుణంగా గ్లామ‌ర్ షో చేస్తుందా

Samantha : ఆ హీరోయిన్ మీద కోపంతోనే స‌మంత అంత దారుణంగా గ్లామ‌ర్ షో చేస్తుందా?

నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత వ్యవహరిస్తున్న తీరు, నిజ జీవితంలో ఆమె ఎదుర్కొంటున్న పరిస్థితులు ఎప్పుడూ జనాల్లో హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి. వ్యక్తిగత జీవితాన్ని తనకు నచ్చినట్లుగా నడిపిస్తున్న సామ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తూ ర‌చ్చ చేస్తుంది. స‌మంత ఇలా చేయ‌డానికి కార‌ణం శోభిత ధూళిపాళ్ల అంటున్నారు. ఈ భామ నాగ చైత‌న్య‌తో రిలేష‌న్‌లో ఉంద‌ని, ఆమె వ‌ల్ల‌నే త‌న‌కి విడాకులు అయ్యాయ‌నే కోపంతో ఉన్న స‌మంత ఇటీవ‌ల గ్లామ‌ర్ షోకి తెర‌లేపింద‌ని అంటున్నారు. సమంత త్వరలోనే వరుణ్ ధావన్‌తో కలిసి సిటాడెల్ వెబ్ సిరీస్‌లో కనిపించనుంది. ఇది అమెరికన్ సిరీస్ సిటాడెల్ వెబ్ సిరీస్‌కి రీమేక్. రాజ్ అండ్ డీకే సిటాడెల్ కి దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ త్వరలో ప్రసారం కానుంది

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది