Samantha : హార్ట్ బ్రేక్ అయిందంటున్న స‌మంత‌.. ఎందుకో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : హార్ట్ బ్రేక్ అయిందంటున్న స‌మంత‌.. ఎందుకో తెలుసా?

Samantha : న‌టుడు నాగ చైతన్య, న‌టి శోభితా ధూళిపాళ నిశ్చితార్థం హైద‌రాబాద్ వేదిక‌క‌గా గురువారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. వీరి ఎంగేజ్‌మెట్ ఫొటోల‌ను న‌టుడు, నాగ చైత‌న్య తండ్రి అక్కినేని నాగార్జున సోష‌ల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. దాంతో ఈ జంట ఫొటోలు, వీరి లవ్‌స్టోరీ నెంటింట వైర‌ల్ అయింది. పలువురు సెలబ్రిటీస్ ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఇదే తరుణంలో హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో […]

 Authored By ramu | The Telugu News | Updated on :9 August 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Samantha : హార్ట్ బ్రేక్ అయిందంటున్న స‌మంత‌.. ఎందుకో తెలుసా?

Samantha : న‌టుడు నాగ చైతన్య, న‌టి శోభితా ధూళిపాళ నిశ్చితార్థం హైద‌రాబాద్ వేదిక‌క‌గా గురువారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. వీరి ఎంగేజ్‌మెట్ ఫొటోల‌ను న‌టుడు, నాగ చైత‌న్య తండ్రి అక్కినేని నాగార్జున సోష‌ల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. దాంతో ఈ జంట ఫొటోలు, వీరి లవ్‌స్టోరీ నెంటింట వైర‌ల్ అయింది. పలువురు సెలబ్రిటీస్ ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఇదే తరుణంలో హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో హార్ట్ బ్రేక్ సింబల్ ను పోస్ట్ చేయగా అది ప్రస్తుతం వైరల్ గా మారింది. వాస్త‌వానికి సమంత పోస్ట్ చేసింది వీళ్ల నిశ్చితార్థానికి సంబంధించిన పోస్ట్ కాదు. పారిస్ ఒలింపిక్స్ లో కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్న కారణంగా అన‌ర్హ‌త‌కు గురై ఏకంగా రెజ్లింగ్ క ఏ వీడ్కోలు ప‌లికిన వినేశ్ ఫోగాట్ కు సంబందించి.

రెజ్లర్ వినేశ్‌ ఫోగట్ పారిస్ 2024 ఒలింపిక్స్ లో అనర్హత వేటు పడిన తర్వాత రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ వార్త క్రీడాభిమానుల‌ను తీవ్ర నిరాశ‌లోకి నెట్టింది. వినేశ్‌ నిర్ణయంపై తన విదారకాన్ని వ్యక్తం చేసిన నటి సమంతా రూత్ సోష‌ల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో హార్ట్ బ్రేక్ సింబ‌ల్‌ను పంచుకున్నారు.వినేశ్‌ ఫోగట్ భావోద్వేగ సందేశం ఇలా ఉంది, “అమ్మా, రెజ్లింగ్ గెలిచింది, నేను ఓడిపోయాను. దయచేసి నన్ను క్షమించండి, మీ కలలు మరియు నా ధైర్యం ప్రతిదీ విచ్ఛిన్నమైంది. నాకు ఇప్పుడు బలం లేదు. కుస్తీకి వీడ్కోలు (2001-2024). నేను ఉంటాను. మీ అందరికీ రుణపడి ఉంటాను అని పేర్కొంది.

Samantha హార్ట్ బ్రేక్ అయిందంటున్న స‌మంత‌ ఎందుకో తెలుసా

Samantha : హార్ట్ బ్రేక్ అయిందంటున్న స‌మంత‌.. ఎందుకో తెలుసా?

రెజ్లింగ్ లో అనేకమందికి ఆశాజ్యోతిగా, స్ఫూర్తిగా నిలిచిన ఫోగట్ కొంచెం అధిక బరువు కారణంగా పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50 కిలోల రెజ్లింగ్ మ్యాచ్‌కు అనర్హులు కావడం వల్ల ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అనర్హత ఆమె ఒలింపిక్ కలలను దెబ్బతీయడమే కాకుండా అథ్లెట్లు ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల గురించి తీవ్రమైన పరిశీలన, బహిరంగ చర్చకు దారితీసింది. ప్రముఖ నటి సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఫోగాట్ రిటైర్మెంట్ సందేశాన్ని పంచుకున్నారు. దానితో పాటు విరిగిన హృదయం ఎమోజిని పంచుకున్నారు. అభిమానులు మరియు మద్దతుదారులు ఫోగాట్ పదవీ విరమణతో భారతీయ రెజ్లింగ్‌కు ఆమె చేసిన సేవలను, క్రీడల్లో మహిళలకు ట్రయిల్ బ్లేజర్‌గా ఆమె పాత్రను కీర్తిస్తూ అభినంద‌న‌లు, కృతజ్ఞతా సందేశాలు వెల్లువెత్తాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది