Samantha : సమంత సెకండ్ హ్యాండ్ ఐటెం.. దిమ్మదిరిగిపోయే కౌంటర్ ఇచ్చిన హీరోయిన్..
Samantha : బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత అక్కినేని నాగచైతన్య నుంచి డైవోర్స్ తీసుకున్న నాటి నుంచి ఆమెను సోషల్ మీడియా వేదికగా కొందరు ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే సమంత కూడా తగ్గేదేలే అన్నట్లుగా తనను ట్రోల్ చేస్తున్న వారికి కౌంటర్స్ ఇస్తూనే ఉంది. తాజాగా సమంతపై ఓ వ్యక్తి తీవ్రస్థాయిలో నెగెటివ్ కామెంట్స్ చేయగా, అతడికి అంతకు మించిన స్థాయిలో, అతని దిమ్మ దిరిగిపోయేలా కౌంటర్ ఇచ్చింది సమంత.కమరాలి దుకండర్ అనే వ్యక్తి మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదికగా సమంతను విమర్శిస్తూ తీవ్రమైన ట్వీట్ చేశాడు.
సదరు పోస్టులో సమంతను తీవ్రస్థాయిలో తప్పుబడూ ట్వీట్ చేశాడు కమరాలి దుకండర్.. ఇక సమంత సైతం తన ట్వీట్‌కు దిమ్మదిరిగిపోయే రిప్లయి ఇచ్చింది. ఇంతకీ కమరాలి దుకండర్ ఏమని ట్వీట్ చేశాడంటే.. సమంత విడాకులు తీసుకున్న, నాశనమైపోయిన సెకండ్ హ్యాండ్ ఐటెం అని, ఓ జెంటిల్ మ్యాన్ నుంచి రూ.50 కోట్లను దొంగిలించిందని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసిన సమంత.. తీవ్రస్థాయిలోనే స్పందించింది. కమరాలి దుకండర్ నీ ఆత్మకు భగవంతుడు శాంతి ప్రసాదించును గాక.. అని ట్వీట్ చేసింది.

samantha mindblowing counter to netizen
Samantha : చేతులారా కెరీర్ నాశనం చేసుకున్న సమంత..
ఈ క్రమంలో కమరాలి దుకండర్ చేసిన ట్వీట్ గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇంతకీ సమంత రూ.50 కోట్లు ఎవరి దగ్గరి నుంచి రాబరీ చేసిందని చర్చిస్తున్నారు. సెకండ్ హ్యాండ్ ఐటెం అని సదరు వ్యక్తి ట్వీట్ చేయడంలో ఉద్దేశం ‘పుష్ప’ సినిమాలోని ఐటెం సాంగ్ గురించేనా.. అని అనుకుంటున్నారు. మొత్తంగా సమంత ట్విట్టర్‌లోనూ ఈ ఇష్యూ ద్వారా ట్రెండింగ్‌లోకి వచ్చేస్తుందని చెప్పొచ్చు.
Kamarali Dukandar God bless your soul . https://t.co/IqA1feO9K1
— Samantha (@Samanthaprabhu2) December 21, 2021