Samantha : ఆనందంలో అభిమానులు.. సమంత, నాగచైతన్యలను కలిపిన ప్రభాస్..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : ఆనందంలో అభిమానులు.. సమంత, నాగచైతన్యలను కలిపిన ప్రభాస్..?

 Authored By mallesh | The Telugu News | Updated on :22 December 2021,5:00 pm

Samantha : టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత నాగచైతన్య నుంచి విడిపోయిన సంగతి అందరికీ విదితమే. కాగా, వారిరువురు విడిపోవద్దని, కలిసే ఉండాలని సెలబ్రిటీలతో పాటు చాలా మంది అక్కినేని వారి అభిమానులు అనుకున్నారు. కానీ, వారి ఎక్స్‌పెక్టేషన్స్ రాంగ్ అయిపోయాయి. వారిరువురు అఫీషియల్‌గా డైవోర్స్ తీసుకున్నారు. ఈ సంగుతులు అలా ఉంచితే.. నాగచైతన్య, సమంతలను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కలిపినట్లు వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.నాగచైతన్య, సమంత ఇద్దరూ వైవాహిక బంధం నుంచి విడిపోయినప్పటికీ ఫ్రెండ్స్‌గా కలిసే ఉంటామని ప్రకటించారు.

ఈ క్రమంలోనే వారిరువురు మళ్లీ కలిసే అవకాశాలుంటాయా అని కూడా కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా చర్చలు జరిపారు. ఈ సంగతులు పక్కనబెడితే.. ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ కార్యక్రమంలో వీరిరువురిని ఒకే వేదికపై కలిపినట్లు వార్తలొస్తున్నాయి. అయితే, ఇందులో నిజమెంత ఉంది అనేది తెలియదు. కానీ, సోషల్ మీడియాలో ప్రభాస్, నాగచైతన్య, సమంత ముగ్గురు కలిసి ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.ప్రభాస్ ప్రజెంట్ పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’ బిజీలో ఉన్నాడని ఈ సందర్భంగా పలువురు అభిమానులు అంటున్నారు.

samantha naga chaitanya met in presence of prabhas is true

samantha naga chaitanya met in presence of prabhas is true

Samantha : ప్రొఫెషనల్ లైఫ్‌లో నాగచైతన్య, సమంత.. ఇద్దరూ ఫుల్ బిజీ..

ఈ నేపథ్యంలో ప్రభాస్ సమంత, నాగచైతన్యలను ఎందుకు కలిపాడని పలువురు ప్రభాస్ అభిమానులు అడుగుతున్నారు. మొత్తంగా ఆ వార్తలో నిజమెంత ఉంది అనేది తెలియదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం వార్త తెగ చక్కర్లు కొట్టేస్తున్నది. ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ చిత్రం వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. యాక్షన్ చిత్రం ‘సాహో’ తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం ఇది. కాగా, ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. పీరియాడిక్ ఫిల్మ్‌గా వస్తున్న ఈ సినిమాకు రాధ కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ లవ్ స్టోరిలో ప్రభాస్‌కు జోడీగా పూజా హెగ్డే నటించింది.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది