Samantha : చైతూ- శోభిత వివాహంపై తొలిసారి స్పందించిన స‌మంత‌…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : చైతూ- శోభిత వివాహంపై తొలిసారి స్పందించిన స‌మంత‌…!

 Authored By ramu | The Telugu News | Updated on :5 February 2025,10:30 pm

ప్రధానాంశాలు:

  •  Samantha : చైతూ- శోభిత వివాహంపై తొలిసారి స్పందించిన స‌మంత‌...!

Samantha : టాలీవుడ్ Tollywood స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు నాగ చైత‌న్య naga chaitanya నుండి విడిపోయిన త‌ర్వాత నిత్యం ఏదో ఒక విష‌యంతో వార్త‌ల‌లో నిలుస్తూనే ఉంది. చైతూ నుండి విడిపోయిన త‌ర్వాత మ‌యోసైటిస్ బారిన ప‌డింది. దాంతో కొన్నాళ్ల‌పాటు సినిమాల‌కి బ్రేక్ ఇచ్చింది. ఈ మధ్యే సిటాడెల్ హనీ బన్నీ సిరీస్ ద్వారా మంచి సక్సెస్ అందుకున్న సమంత, తన సొంత నిర్మాణ సంస్థలోనే మా ఇంటి బంగారం ప్రాజెక్ట్ చేస్తుంది.

Samantha చైతూ శోభిత వివాహంపై తొలిసారి స్పందించిన స‌మంత‌

Samantha : చైతూ- శోభిత వివాహంపై తొలిసారి స్పందించిన స‌మంత‌…!

Samantha అలా ఏమి లేదు..

ఈ మ‌ధ్య సినిమాలు త‌గ్గించి ఎక్కవ యాడ్స్ చేస్తూ చాలా బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే పలు యూట్యూబ్ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలిస్తుంది. అయితే తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో అక్కినేని నాగచైతన్య naga chaitanya రెండో వివాహంపై స్పందించి, షాకింగ్ రిప్లై ఇచ్చింది. యాంకర్, మీ మాజీ భర్త కొత్త బంధంలోకి అడుగు పెట్టడం మీకు అసూయగా ఉందా అని అడగ్గా, దానికి సామ్ సమాధానం ఇస్తూ.. నా లైఫ్‌లో అసూయకు తావు లేదు. అసూయనే అన్ని చెడు పనులకు కారణం అవుతుందని నేను నమ్ముతాను. కాబట్టీ నాకు ఎవరిపై అసూయ లేదు.

నేను నా గత కాలపు గాయాల నుంచి బయటపడానికి చాలా శ్రమించాను. నాకు ఎవ‌రిపై ఎలాంటి అసూయ ఉండదంటూ చాలా సింపుల్‌గా ఆన్సర్ ఇచ్చేసింది. దీంతో చైతూ వివాహాన్ని సమంత చాలా లైట్ తీసుకుంది. సామ్ చాలా స్ట్రాంగ్ ఉమెన్ అంటున్నారు తన అభిమానులు. ఇక చైతూ విష‌యానికి వ‌స్తే వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొన్న చైతు ఆ తర్వాత పలు సినిమాలలో నటించిన ఒకటి కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ అనుకోలేక పోయింది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది