Samantha : స్పెషల్ సాంగ్ కోసం అన్ని కోట్లా.. సమంత రేంజ్ అదే మరి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : స్పెషల్ సాంగ్ కోసం అన్ని కోట్లా.. సమంత రేంజ్ అదే మరి..!

 Authored By mallesh | The Telugu News | Updated on :16 November 2021,3:40 pm

Samantha : టాలెంటెడ్ హీరోయిన్ సమంత అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే నాగచైతన్య, సమంత ఎవరి కెరీర్‌పైన వారు ఫోకస్ చేశారు. ఇక సమంత అయితే వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ‘శాకుంతలం, కాతు వాకుల రెండు కాదల్’ చిత్రాల షూటింగ్స్ పూర్తి చేసిన సమంత.. ప్రజెంట్ బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌పైన కాన్సంట్రేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది.

పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’లో డ్యాన్స్ నెంబర్ చేసేందుకుగాను సమంత ఒప్పుకుందని, ఆమె స్పెషల్ డ్యాన్స్ నెంబర్‌లో కనబడబోతున్నదని మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు. దీంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బన్నీ డ్యాన్స్ బీట్స్‌కు చేసే స్టెప్స్‌కు మ్యాచ్ చేయగలిగే సత్తా సమంతకు ఉందని అంటున్నారు. ప్రత్యేక గీతంలో సందడి చేసేందుకుగాను సమంత ఒప్పుకుందని విషయం తెలిపారు మేకర్స్.

samantha remuneration for item song in pushpa film

samantha remuneration for item song in pushpa film

Samantha : బన్నీ డ్యాన్స్ స్టెప్స్‌కు ధీటుగా సమంత స్టెప్స్..!

ఈ మేరకు ఆమెకు థాంక్స్ చెప్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ‘పుష్ప’ ఫిల్మ్‌లోని ఐదో సాంగ్ కోసం సమంతను సంప్రదిస్తే.. ఆమె వెంటనే ఓకే చెప్పారని వివరించారు. ఇకపోతే సమంత తన కెరీర్‌లో చేస్తున్న తొలి ఐటెం సాంగ్ ఇదే అవుతుండటం విశేషం. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలన్నిటిలోనూ ఐటెం సాంగ్స్ ఓ రేంజ్‌లో ఉంటాయన్న సంగతి తెలిసిందే. స్పెషల్ సాంగ్ కోసం సమంత ఏకంగా రూ.1.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది. ఇంతకు మందు ఐటెం సాంగ్స్‌లో కనిపించిన కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, తమన్నాలు అంత రెమ్యునరేషన్ తీసుకోలేదట.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న హ్యాట్రికి ఫిల్మ్ ‘పుష్ప’ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. రెండు పార్ట్స్‌గా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘టీజర్, దాక్కో దాక్కో మేక, చూపే బంగారమాయేనా, సామి సామి’సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది