Samantha : సమంత హీరోయిన్ కాకముందు ఏం చేసేదో తెలుసా…?

Authored By aruna | The Telugu News | Published on: July 30, 2022, 3:20 pm

Samantha : సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది సమంత. ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరు సమంత. నాగ చైతన్య తో ‘ ఏ మాయ చేసావే ‘ సినిమాతో జోడి కట్టి తొలిసారి తెలుగు పరిశ్రమకు పరిచయమై, తన నటనతో, అందంతో ప్రేక్షకులందరిని మాయ చేసి చేసింది. ఈ సినిమా హిట్ కావడంతో వరుస సినిమాలతో బిజీగా అయిపోయింది ఈ అమ్మడు. ఇప్పటికే తెలుగు, తమిళ పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది సామ్.. ఈ మధ్యనే బాలీవుడ్ లో ‘ ది ఫ్యామిలీ మెన్ 2 ‘ సిరీస్ తో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుకుంటుంది సామ్.

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ అమ్మడు.ఓవైపు వరుస ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది సమంత. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత ఈ స్థాయికి చేరుకోవడానికి తన జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. తన జీవితంలో అనేక పోరాటాలు చేసి హీరోయిన్ గా ప్రయాణం సాగించిన తీరు అంతా తేలికేమి కాదు. అయితే సమంత హీరోయిన్ కాకముందు ఏదో ఉద్యోగం చేసేదంట. తన మొదటి జీతం చాలా తక్కువ అంట.

Samantha Ruth Prabhu job before movies

Samantha Ruth Prabhu job before movies

అయితే హీరోయిన్ కాకముందు సామ్ ఏ జాబ్ చేసిందో, తన మొదటి జీవితం ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ తాను స్కూల్ లో ఉన్నప్పుడు ఓ కాన్ఫరెన్స్ కోసం హోటల్లో హోస్టెస్ గా పని చేసినట్లు చెప్పింది. సుమారుగా 8 గంటలు షిఫ్ట్ లో పనిచేశానని అందుకు ఆమె రూ.500 తీసుకున్నట్లు వెల్లడించింది. సమంత మొదటి ఉద్యోగం చేసినప్పుడు ఆమె పదవ తరగతి చదువుతుంది. ఇప్పుడు టాప్ హీరోయిన్ గా సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది ఈ ముద్దుగుమ్మ.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp