samantha : ఊ అంటావా మావ సాంగ్ ట్రోల్ వీడియోకు సమంత షాకింగ్ రిప్లై.. వైరల్ వీడియో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

samantha : ఊ అంటావా మావ సాంగ్ ట్రోల్ వీడియోకు సమంత షాకింగ్ రిప్లై.. వైరల్ వీడియో..!

 Authored By kranthi | The Telugu News | Updated on :20 December 2021,3:40 pm

samantha : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎక్కడ విన్నా.. ఊ అంటావా మామ ఊ ఊ అంటావా అనే పాట వినిపిస్తోంది. క్లబ్బుల్లో, పబ్బుల్లో, ప్రైవేట్ పార్టీల్లో అంతా ఈ పాట పెట్టుకుని ఊగి పోతున్నారు. పుష్ప సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతీ పాటకు మంచి పేరు రాగా… ఇటీవల విడుదలైన ఈ స్పెషల్ సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ సాంగ్ కు బన్నీ తో పాటు సమంత స్టెప్పులేయడంతో ఆ పాటకి మరింత క్రేజ్ వచ్చింది. ఫోక్ సింగర్ మంగ్లి చెల్లెలు ఇంద్రావతి చౌహన్ మత్తు వాయిస్.. చంద్రబోస్ లిరిక్స్‏కు శ్రోతలకు కిక్కిస్తోంది. యూత్‏ను ఎంతగానో ఆకట్టుకున్న ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఇదిలా ఉండగా పాటకు ఎంత పేరైతే వస్తుందో…అదే స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

ఊ అంటావా మామ పాటలో వాడిన పదాలు పురుషుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయంటూ ఏపీ పురుషుల సంఘం.. ఆంధ్రప్రదేశ్ కోర్టును ఆశ్రయించింది. చిత్ర బృందంతో పాటు పాటలో నటించిన సమంతపై కూడా కేసు పెట్టింది. ఈ వివాదాలన్నింటిపై ఇన్ని రోజులు అంతగా స్పందించని సమంత… సాంగ్‌ పై వచ్చిన ట్రోల్స్‌పై మాత్రం స్పందించింది.ఊ అంటావా మామ పాటకు సంబంధించి సోషల్ మీడియాలో రీల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల కొంత మంది యువ‌కులు సాంగ్‌పై ఓ వీడియో తయారు చేసి పోస్ట్ చేశారు. అయితే ఇది నెట్టింట ఇప్పుడు తెగ వైరల్‌ గా మారింది. వీడియోలో ఓ యువ‌కుడు ఎగ్జామ్ ఉంది క‌దరా అంటూ ఉండగా… అవతలి వ్యక్తి అందుకు బదులిస్తూ.. అదే భ‌యంగా ఉందిరా ఎగ్జామ్‌లో ఎక్క‌డ ఊ అంటావా మావ‌.. ఉ ఉ అంటావా మామా అని రాసేస్తానేమోన‌ని అంటాడు.

samantha shocking replies to oo antava mava troll viral video

samantha shocking replies to oo antava mava troll  viral video

samantha : ట్రోల్స్‌పై స్పందించిన సమంత..!

నెట్టింట తెగ వైరల్ అవుతున్న పోస్ట్ పై స‌మంత తనదైన శైలిలో స్పందించింది. పోస్ట్‌ ను రీట్వీట్ చేస్తూ లాఫింగ్ ఎమోజీల‌ను జోడించి మరి పోస్ట్ చేసింది. .దీన్ని బట్టి చూస్తే సామ్ ఈ సాంగ్‌ పై వస్తున్న విమర్శలను ఏమాత్రం లెక్క చేయకుండా.. కేవలం పాజిటివ్‌ గా వస్తున్న రివ్యూలపైనే స్పందించాలని డిసైడ్‌ అయినట్లు స్పష్టంగా తెలుస్తోందినాగ చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత స‌మంత‌ వరుస సినిమాలకు సైన్ చేస్తూ దూసుకుపోతోంది. తన విడాకుల వార్తలపై ఎవరెన్ని ర‌కాలుగా కామెంట్స్ చేసిన సామ్ నోరు మెద‌ప‌డకుండా తన రూట్లో తాను వెళ్తోంది. స‌మంత ప్రస్తుతం గుణ శేఖర్ దర్శకత్వంలో శాకుంతలంతో పాటు… పాన్ ఇండియా మూవీ య‌శోదలో న‌టిస్తోంది. అలాగే అరెంజ్‌మెంట్ ఆఫ్ ల‌వ్ అనే ఓ హాలీవుడ్ మూవీ లోనూ తాను యాక్ట్ చేస్తోంది.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది