Samantha – Taapsee : ఒకే ఒరలో రెండు కత్తులు..!

Advertisement

Samantha – Taapsee : ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడగలవా..? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే టాపిక్ రన్ అవుతోంది. దీనికి కారణం స్టార్ హీరోయిన్స్ సమంత, తాప్సీ కలిసి ఓ సినిమా చేయబోతుండటమే. సినిమాల పరంగా ఇద్దరు ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. ఇప్పటికే సమంత నటించిన శాకుంతలం, యశోద సినిమాల పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. మరోవైపు తమిళ స్టార్ హీరో విజయ్ సరసన మరో సినిమా చేయబోతుందనీ వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, హాలీవుడ్ సినిమాను కమిటైంది. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలవబోతుంది. ఇందులో సమంత లెస్బియన్ రోల్‌లో నటించబోతుంది.

అయితే, గత కొన్ని రోజులుగా సమంత బాలీవుడ్ సినిమాను కమిటైందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అది కూడా మరో క్రేజీ హీరోయిన్ తాప్సీ పన్ను నిర్మాణంలో. దాంతో ఇద్దరు కత్తుల్లాంటి హీరోయిన్స్ కలిసి సినిమా చేస్తే అబ్బో ఆక్రేజ్ మరో లెవల్ అని మాట్లాడుకుంటున్నారు. మరికొందరేమో ఇలాంటి ఇద్దరు కత్తుల్లాంటి హీరోయిన్స్ కలిసి సినిమా అంటే బాగా క్రియేటివ్ డిఫరెన్సెస్ వస్తాయని చెప్పుకుంటున్నారు. దాంతో అసలు ఈ కాంబినేషన్‌లో సినిమా ఉండే అవకాశం లేదని అన్నారు.

Advertisement
Samantha - Taapsee Are Two Swords in one Movie
Samantha – Taapsee Are Two Swords in one Movie

Samantha – Taapsee : వార్తలు కేవలం రూమర్స్ ..!

ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్‌పై స్వయంగా తాప్సీ కన్‌ఫర్‌మేషన్ ఇచ్చింది. తను నటించిన లేటెస్ట్ మూవీ శభాష్ మిథు. త్వరలో రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాప్సీ పలు మీడియా ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తోంది. దీనిలో భాగంగా తన నిర్మాణంలో సమంత నటిస్తున్న విషయాన్ని అధికారికంగా
వెల్లడించింది. ఇదే సమయంలో సమంతతో కలిసి నటించబోతుందనే వార్తలు కేవలం రూమర్స్ అని క్లారిటీ ఇచ్చింది. ఇక అవసరమైతే, పాత్ర డిమాండ్ చేస్తే మాత్రం నటించే అవకాశాలున్నట్టుగా వెల్లడించింది. సో మొత్తానికి సమంత – తాప్సీల ప్రాజెక్ట్‌పై సాలీడ్‌గా క్లారిటీ వచ్చేసింది. మరి ఈ సినిమా
ఎప్పుడు షూటింగ్ మొదలవుతుందో చూడాలి.

Advertisement
Advertisement