Samantha : నాగ చైత‌న్య రెండో పెళ్లి త‌ర్వాత స‌మంత సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఇక ఉండే ప్ర‌సక్తే లేద‌ట‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : నాగ చైత‌న్య రెండో పెళ్లి త‌ర్వాత స‌మంత సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఇక ఉండే ప్ర‌సక్తే లేద‌ట‌..!

 Authored By ramu | The Telugu News | Updated on :13 August 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Samantha : నాగ చైత‌న్య రెండో పెళ్లి త‌ర్వాత స‌మంత సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఇక ఉండే ప్ర‌సక్తే లేద‌ట‌..!

Samantha : ఒకప్పడు టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటీ కపుల్స్ నాగ చైతన్య-సమంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్రేమించి పెద్దలను ఒప్పించి.. మూడు మూళ్ల బంధంతో ఒక్కటైన ఆ జంట కొద్ది రోజులకే విడిపోయింది. ఎవరూ ఊహించిన విధంగా చైతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రాణంలా ప్రేమించిన సామ్ కు విడాకులు ఇచ్చి శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లి డే ను కూడా త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ సందర్భంలో సమంత తన మాజీ భర్త నాగచైతన్యకు దిమ్మతిరిగిపోయేలా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
స‌మంత సంచ‌ల‌న నిర్ణ‌యం..

విడాకుల త‌ర్వాత ఇద్దరు సెపరేట్ అయ్యి ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. కాగా జస్ట్ కొన్ని రోజులు కితం తన జీవిత కొత్త భాగస్వామి అంటూ ప్రముఖ నటి శోభిత ధూళిపాళని అక్కినేని కుటుంబం అనౌన్స్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. దీనితో మళ్ళీ చైతు, సమంతల ఫ్యాన్స్ నడుమ గొడవ మొదలైంది. అయితే సామ్ ఫ్యాన్స్ కొందరు శోభిత వల్లనే చైతు సమంత విడిపోయారు అని సామ్ తో పెళ్ళైన తర్వాత కూడా నాగ చైతన్య శోభిత ధూళిపాళతో రిలేషన్ షిప్ మైంటైన్ చేసాడు అని పలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే చైతూ- శోభిత ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయని సామ్‌.. ఇకపైనా ఈ విషయంలో స్పందించకూడదని నిర్ణయం తీసుకుందంట.

Samantha నాగ చైత‌న్య రెండో పెళ్లి త‌ర్వాత స‌మంత సంచ‌ల‌న నిర్ణ‌యం ఇక ఉండే ప్ర‌సక్తే లేద‌ట‌

Samantha : నాగ చైత‌న్య రెండో పెళ్లి త‌ర్వాత స‌మంత సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఇక ఉండే ప్ర‌సక్తే లేద‌ట‌..!

అందుకోసం టాలీవుడ్‌కు దూరంగా ఉండాలని, మరికొన్నాళ్లు ముంబైలోనే గడపాలని నిర్ణయించుకుందట బ్యూటీ క్వీన్‌ సమంత. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న సమంత.. బాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ల్లో ఎక్కువగా నటిస్తున్నారు. తెలుగులో ప్రస్తుతం ఆమెకు ఎలాంటి సినిమాలు లేకపోవడం, వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ల కోసం ముంబైలోనే ఎక్కువగా గడుపుతున్నారు సమంత. దీంతో కొన్నాళ్లుగా హైదరాబాద్‌లో కనిపించడం లేదు సమంత. ఇలాంటి సమయంలో నాగ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్‌ జరగడంతో ఇక కొన్నాళ్లు ముంబైలో ఉండిపోవాలని నిర్ణయం తీసుకున్నారట. నాగ చైతన్యతో విడాకులు తర్వాత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సమంత ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితుల నుంచి బయటపడుతున్నారు

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది