Samantha : సమంతతో సన్నిహితంగా ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా?
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతున్న అందాల ముద్దుగుమ్మ సమంత. ఇప్పుడు సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడికి దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. గతేడాది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప : ది రైజ్’ మూవీలో నటించింది. అంతకు ముందేడాది కూడా ఒక్క ‘జాను’లోనే మెరిసింది. కానీ ఈ ఏడాది వరుస సినిమాలు చేస్తోంది. తెలుగులో ‘శాకుంతలం’, ‘యశోద’ తో పాటు తమిళంలో ‘కాతు వాకుల రెండు కాదల్’ అనే చిత్రంలోనూ నటిస్తోంది. గుణ టీంవర్క్ బ్యానర్ పై నీలిమా గుణ నిర్మాణం వహించిన చిత్రం ‘శాకుంతలం’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఇక ప్రస్తుతం సమంత ‘యశోద’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉంది. ఏకంగా సెట్ లోనే ఉంటూ శరవేగంగా షూటింగ్ ముగించుకుంటున్నట్టు తెలుస్తోంది.
సమంత ఇంతకముందు చేసిన యాక్షన్ చిత్రాలకు డిఫరెంట్‌గా ఈ మూవీ తెరకెక్కుతుంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రంగా ‘యశోద’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి హరిశంకర్ మరియు హరీశ్ నారాయణ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక క్రిష్ణ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో కొంత భాగం యాక్షన్స్ సీక్వెల్స్ ను కూడా చిత్రీకరిస్తున్నారు. అయితే ఇందుకోసం మేకర్స్ ఏకంగా హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్ నే రంగంలో దించారు.

samantha working with hollywood choreographer
Samantha : సమంత హార్డ్ వర్క్
‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌కు కూడా యానిక్ బెన్ వర్క్ చేశారు. అందులో యాక్షన్ సీన్స్‌ను ఆయనే డైరెక్ట్ చేశారు. ప్రస్తుతం ‘యశోద’ మూవీకి యాక్షన్ పార్ట్ కు దర్శకత్వం వహిస్తున్నారు యానిక్ బెన్. ఇప్పటికే హైదరాబాద్‌లో పది రోజుల పాటు ‘యశోద’ యాక్షన్ సీక్వెన్స్ తీశారు. ఇంకో యాక్షన్ సీక్వెన్స్ కోసం చిత్రం యూనిట్ కొడైకెనాల్‌కు వెళ్లనుంది. అక్కడే ఈ యాక్షన్ ను షూట్ చేయాలని ప్లాన్ చేశారు. దాదాపుగా మూడు కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఆర్ట్ డైరెక్టర్ అశోక్ వేసిన ఫైవ్ స్టార్ హోటల్ సెట్స్‌లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. యానిక్ బెన్ సమంత కోసం వర్క్ చేయడం ఇది రెండోసారి. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే థ్రిల్లర్ చిత్రంగా యశోద రూపొందుతుంది. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకులు.