
Sameera Reddy : ఆ సర్జరీ చేయించుకోమని చాలా ఒత్తిడి చేశారు.. స్టన్నింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్
Sameera Reddy : తెలుగు నేపథ్యం ఉన్న ఫ్యామిలీలో జన్మించిన సమీరా రెడ్డి ‘మైనే దిల్ తుజ్‌కో దియా’ అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించింది. తద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకుని ఫుల్ పాపులారిటీని తెచ్చుకుంది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘నరసింహుడు’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్‌గా ఎంటరైంది. మెగాస్టార్ చిరంజీవితో ‘జై చిరంజీవ’ అనే మూవీ చేసినా కానీ ఇది కూడా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్‌తో ‘అశోక్’ చేసినా ఇదీ డిజాస్టరే అయింది. సినిమాల్లో అంతగా సక్సెస్ కాలేకపోయిన సమీరా రెడ్డి 2014లో సమీరా రెడ్డి ఆక్షయ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.
సమీరా రెడ్డి మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన ఎన్నో పర్సనల్ విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఇప్పుడు మరోసారి సినిమాల్లోకి వచ్చే ప్రయత్నాల్లో ఉంది. రీఎంట్రీలో మంచి పాత్రల కోసం వెయిట్ చేస్తున్న సమీరా రెడ్డి గతాన్నితవ్వుకుంటోంది. ఆ గతంలో కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయంటోంది. సమీరా రెడ్డి మాట్లాడుతూ.. ‘నా కెరీర్లో స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉన్నప్పుడు నాపై చాలా ఒత్తిడి బాగా ఉండేది. ముఖ్యంగా కొంతమంది బ్రెస్ట్ ఇంప్లాంటేషన్చేయించుకోమని సలహా ఇచ్చారు. అందరు చేయించుకుంటున్నారు కదా.. మీకేమైందంటూ అడిగేవారు.నాకు విసుగెత్తి చేయించుకోను అని అంటే… రివర్స్ లో వాదించి ఒప్పించే ప్రయత్నం చేసేవారు. అలాగే అందరూ చేయించుకుంటున్నారు కదా.. మీకు ఏమైదంటూ అడిగేవారు.
Sameera Reddy : ఆ సర్జరీ చేయించుకోమని చాలా ఒత్తిడి చేశారు.. స్టన్నింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్
ఇలా సర్జరీ చేసుకోమని నాపై చాలా ఒత్తిడి తెచ్చారు. కానీ నాకు అది ఇష్టం లేదు అని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో మన చేతిలో లేని కొన్ని ఒత్తిడిలు తప్పవంటూ చెప్పుకొచ్చింది.నేను ప్లాస్టిక్ సర్జరీ, బొటాక్స్ చేయించుకునే వారిని తప్పుపట్టను. అలా అని నా విషయంలో నా సమస్యను నేను అంతర్గతంగానే పరిష్కరించుకోగలను అని చెప్పుకొచ్చింది. శరీరాకృతి విషయంలో చుట్టుపక్కల వాళ్లు నన్ను కామెంట్ చేశారు. చివరికి కూరగాయలు అమ్మే వ్యక్తి కూడా ‘మీకు ఏమైంది? ఇది మీరేనా?’ అని అడిగాడు. వాళ్ల విమర్శలు నన్ను ఎంతో భయపెట్టాయి” అని అన్నారు. ఫొటోగ్రాఫర్స్‌కు కనిపించకూడదనే ఉద్దేశంతో కొంతకాలం బయటికి కూడా వెళ్లలేదని చెప్పారు. అన్నీ సెట్ అయి, మంచి కథ, బ్యానర్ కుదిరితే ఆమె త్వరలోనే తెలుగు సినిమాలో కనిపించడం ఖాయం అంటుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.