Adah Sharma : సినిమాల కోసం చేసిన తప్పులు.. 48 రోజుల పాటు ఆ హీరోయిన్‌కి నాన్‌స్టాప్..!
Adah Sharma : హీరోయిన్స్ పైకి చాలా అందంగా కనిపిస్తున్నా కూడా లోపల మాత్రం ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. వారిని అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. కొందరు భామలు పలు సందర్భాలలో వారి ఆరోగ్య సమస్యలు బయటకు చెప్పడంతో విషయం బయటకు వస్తుంటుంది. తాజాగా హార్ట్ ఎటాక్ బ్యూటీ ఆదాశర్మ తను ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్పి షాకిచ్చింది. అదా శర్మ ని స్పెషల్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సినన అవసరం లేదు. చాలా తెలుగు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అయితే.. చెప్పుకోదగ్గ గుర్తింపు రాకపోవడంతో…. తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ కి షిప్ట్ చేసింది.
అక్కడ మాత్రం.. ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు, తన పాత్రకు ప్రాధాన్యత ఉండే.. వెబ్ సిరీస్ లు చేస్తూ… కెరీర్ లో దూసుకుపోతోంది. మొనీమధ్య ది కేరళ స్టోరీస్ అనే సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఈ సినిమా పలు వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే అక్కడ పలు సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తుంది అదా శర్మ. ఆతర్వాత బస్తర్ (ది నక్సల్ స్టోరీ) అనే సినిమా చేయగా, ఆ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గ ఉంటూ క్యూట్ క్యూట్ పిక్స్ తో పిచ్చెక్కిస్తూ ఉంటుంది.
Adah Sharma : సినిమాల కోసం చేసిన తప్పులు.. 48 రోజుల పాటు ఆ హీరోయిన్‌కి నాన్‌స్టాప్..!
తాజాగా తనకు ఎదురైన విచిత్ర పరిస్థితి గురించి చెప్పుకొచ్చింది అదా శర్మ. పీరియడ్స్ కారణంగా తాను చాలా ఇబ్బంది పడతాను అని చెప్పుకొచ్చింది ఇందుకు కారణం కూడా చెప్పింది. తన హెల్త్ ఇష్యూలకు కారణం తను సినిమాల కోసం చేసిన డైటింగ్ లు అంటోంది ఈ ముద్దుగుమ్మ. కేరళ స్టోరీ సినిమాలో కాలేజీ అమ్మాయిలా కనిపించాలి అందుకోసం బరువు తగ్గాను.. ఆతర్వాత బస్తర్ సినిమా కోసం బరువు పెరిగాను. ఇందుకోసం చాలా డైటింగ్ చేశా.. బరువు తగ్గడం, మళ్లీ పెరగడం, ఆ తర్వాత తగ్గడం వల్ల నా శరీరంలో చాలా మార్పులు రావడంతో అనారోగ్యంకు గురయ్యాను. దాంతో నాకు ఎండోమెట్రియోసిస్ సమస్య వచ్చింది. ఈ వ్యాధి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నా.. పీరియడ్స్ నాన్‌స్టాప్‌గా కొనసాగుతూ ఉంటుంది. దాదాపు 48 రోజుల పాటు బ్లీడింగ్ అవుతుంది. దాంతో చాలా ఇబ్బందిపడుతున్నా అంటూ ఆదా చెప్పుకొచ్చింది.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.