sankranthiki vasthunam 1st day collection : వెంకీ మామనా, మజకానా.. ఓవర్సీస్‌లో అదరగొడుతున్న సంక్రాంతికి వస్తున్నాం…!
ప్రధానాంశాలు:
sankranthiki vasthunam 1st day collection : వెంకీ మామనా, మజకానా.. ఓవర్సీస్‌లో అదరగొడుతున్న సంక్రాంతికి వస్తున్నాం...!
sankranthiki vasthunam 1st day collection : సంక్రాంతి బరిలో నిలిచిన సూపర్ హిట్ చిత్రాలలో సంక్రాంతికి వస్తున్నాం sankranthiki vasthunam మూవీ ఒకటి. అనిల్ రావిపూడి anil ravipudi దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా నిన్న (జనవరి 14న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం రిలీజైంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఓవర్సీస్‌లో ఈ చిత్రం తొలి రోజు 7లక్షల డాలర్లు రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలిపింది. వెంకటేశ్ కెరీర్‌లో ఇంత స్థాయి వసూళ్లు రావడం ఇదే తొలిసారి అని ప్రకటించటంతో, ఈ చిత్రం త్వరలోనే వన్ మిలియన్ క్లబ్‌లో చేరడం ఖాయమని అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు.
sankranthiki vasthunam 1st day collection రేట్ ఫీట్..
ఈ ఫీట్ సాధించడంతో వెంకీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అతి త్వరలోనే ఈ చిత్రం వన్ మిలియన్ క్లబ్‌లో చేరడం ఖాయం అని కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ చిత్రంలో వెంకీ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌లు కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం అందరిని కడుపుబ్బా నవ్వించి మెప్పించింది. బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చినందుకు ప్రేక్షకులకు చిత్ర బృందం కృతజ్ఞతలు తెలియజేసింది. ‘మా చిత్రాన్ని ఆదరించిన అభిమానులు, ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రేక్షకుల ముఖంలో ఆనందం చూస్తుండడం ఓ ఎమోషన్. పండగకు మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టును మొదలు పెట్టాం. మేం అనుకున్నట్లుగానే మీరు విజయాన్ని అందించారు.’ అని వెంకటేష్ అన్నారు.
సాధారణంగా ఓవర్సీస్ లో స్టార్ హీరోల సినిమాలకు కలెక్షన్లు వచ్చిన స్థాయిలో సీనియర్ హీరోల సినిమాలకు కలెక్షన్లు రావనే సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రం ఓవర్సీస్ కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది. వెంకటేశ్ రెమ్యునరేషన్ 8 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. విక్టరీ వెంకటేశ్ తర్వాత సినిమాలతో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విక్టరీ వెంకటేశ్ కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడాల్సి ఉంది. విక్టరీ వెంకటేశ్ వయస్సు 64 సంవత్సరాలు అయినా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఆయన ఫిట్ గా కనిపించడం గమనార్హం.