Venkatesh : ట్రైలర్ హిట్టు.. సెన్సార్ టాక్ కూడా డబుల్ హిట్టు.. పొంగల్ కి వెంకటేష్ సినిమా ఆ రెండిటికి షాక్ ఇస్తుందా..?
ప్రధానాంశాలు:
Venkatesh : ట్రైలర్ హిట్టు.. సెన్సార్ టాక్ కూడా డబుల్ హిట్టు.. పొంగల్ కి వెంకటేష్ సినిమా ఆ రెండిటికి షాక్ ఇస్తుందా..?
Venkatesh : సంక్రాంతికి సినిమాలు వస్తున్నాయ్ అంటే వాటి మధ్య భీకరమైన ఫైట్ ఉంటుంది. ఈసారి సంక్రాంతికి బాలయ్య డాకు మహారాజ్ Daku Maharaj, విక్టరీ వెంకటేష్ Venkatesh సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు పోటీ పడుతున్నాయి. సీనియర్ హీరోల మధ్య ఈ పోటీ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఐతే డాకు మాస్ సినిమాగా వస్తుంటే సంక్రాంతికి వస్తున్నాం మాత్రం ఎంటర్టైనర్ గా వస్తుంది. ఐతే ఈ సినిమాలతో పాటు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కూడా వస్తుంది.
ఐతే గేమ్ ఛేంజర్ సినిమా యాక్షన్ మూవీగా వస్తుంది. డాకు మహారాజ్ సినిమా మాస్ మూవీగా వస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తుంది. ఐతే ముందొచ్చే రెండు సినిమాలు యాక్షన్, మాస్ సినిమాలు కాగా వెంకటేష్ సినిమా ఫ్యామిలీస్ టార్గెట్ తో వస్తుంది. ఇక లేటెస్ట్ గా రిలీజైన ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచింది.
ఐతే సంక్రాంతికి వస్తున్నాం Sankranthiki Vastunnam ట్రైలర్ సూపర్ హిట్ అయ్యింది. విక్టరీ వెంకటేష్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు తరహాలో ఈ సినిమా కూడా భార్య, మాజీ గర్ల్ ఫ్రెండ్ మధ్య అదిరిపోబోతుంది. ఐతే ట్రైలర్ చూశాక వెంకీ మామ ష్యూర్ షాట్ హిట్ కొట్టేలా ఉన్నాడు. అంతేకాదు రీసెంట్ గా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెన్సార్ నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
సో విక్టరీ వెంకటేష్ సినిమాను సంక్రాంతి రేసులో తక్కువ అంచనా వేయడానికి లేదు. గేమ్ ఛేంజర్ Game Changer, డాకు మహారాజ్ అయినా మాస్ ఆడియన్స్ కి ఎక్కితే హిట్ అవుతాయి. కానీ సన్ర్కాంతికి వస్తున్నాం మాత్రం ఫ్యామిలీస్ కి నచ్చితే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టే లెక్క. మరి సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆశించిన స్థాయి సక్సెస్ అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. వెంకటేష్ లాస్ట్ సంక్రాంతికి సైంధవ్ ఫ్లాప్ కాగా ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు వెంకీమామ. Venkatesh, Sankranthiki Vastunnam, Balakrishna, Daku Maharaj, Ram Charan, Game Changer