Sankranti Movies : సంక్రాంతి పై కన్నేసిన 5 భారీ సినిమాలు.. వెనక్కి తగ్గేదే లేదు అంటున్న హీరోలు..!

Authored By Anusha V | The Telugu News | Updated on: December 20, 2023, 3:58 pm
  •  Sankranti Movies : సంక్రాంతి పై కన్నేసిన 5 భారీ సినిమాలు.. వెనక్కి తగ్గేదే లేదు అంటున్న హీరోలు..!

Sankranti Movies : సంక్రాంతికి సినిమాల మధ్య పోటీ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. పండుగలకి సినిమాని రిలీజ్ చేసి హిట్టు కొట్టాలని హీరోలు భావిస్తుంటారు. ఈ క్రమంలో ఈసారి వచ్చే సంక్రాంతికి స్టార్ హీరోలంతా పోటీ పడుతున్నారు. మరీ ముఖ్యంగా మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ‘ గుంటూరు కారం ‘ సినిమా మూడు సంవత్సరాల నుంచి తెరకెక్కుతూనే ఉంది. కాబట్టి ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ గట్టిగా ఫిక్స్ అయ్యారు. కాబట్టి ఈ సినిమా విషయంలో వెనక్కి తగ్గే అవకాశం లేనట్లుగా కనిపిస్తోంది. అలాగే విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న ‘ సైంధవ్ ‘ సినిమా కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎప్పటినుంచో రెడీగా ఉంది. నిజానికి ఈ సినిమా డిసెంబర్ 21న విడుదల కావాల్సి ఉంది…

కానీ ప్రభాస్ ‘ సలార్ ‘ సినిమా డిసెంబర్ 22వ తేదీన రాబోతుండడంతో సలార్ తో పోటీ ఎందుకు అని ఉద్దేశంతో ఈ సినిమాని సంక్రాంతికి పోస్ట్ పోన్ చేశారు. ఇక ఈ సినిమా మరోసారి పోస్ట్ పోన్ చేసే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఇక నాగార్జున హీరోగా వస్తున్న ‘ నా సామి రంగ ‘ సినిమా కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తుంది. నాగార్జున తప్పకుండా ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలనే ఉద్దేశంతో పట్టుబట్టి మరి డైరెక్టర్ తో చాలా ఫాస్ట్ గా సినిమాని తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇలాంటి సమయంలో నాగార్జున వెనక్కి తగ్గే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఇక రవితేజ ‘ ఈగల్ ‘ సినిమా కూడా సంక్రాంతికి విడుదల అయ్యే ఆలోచనలో ఉంది. రవితేజ సంక్రాంతి పండుగను చాలా సెంటిమెంట్ గా భావిస్తుంటారు. గతేడాది సంక్రాంతికి చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఆ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించిన రవితేజ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్నారు. ఇక ఇప్పుడు కూడా తన సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని, ఆ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు అని భావిస్తున్నారు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ‘ హనుమాన్ ‘ సినిమా కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాలని ఆలోచిస్తుంది. ఈ సినిమాని తప్పకుండా వాళ్లు సంక్రాంతి రిలీజ్ చేయాలి. ఎందుకంటే నార్త్ లో అయోధ్య రామ జన్మభూమి ప్రతిష్ట కార్యక్రమానికి ముందే ఈ సినిమాని రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ చూస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఇండస్ట్రీ పెద్దలు ఈ విషయంలో కలిగించుకొని కొన్ని సినిమాలను పోస్ట్ పోన్ చేయిస్తే బాగుంటుందని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇన్ని సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయితే అన్ని సినిమాల కలెక్షన్ల మీద భారీగా దెబ్బపడే అవకాశాలు ఉంటాయి. మరి ఈ సంక్రాంతికి కొన్ని సినిమాలు డ్రాప్ అవుతాయా లేక రిలీజ్ అవుతాయా అనేది చూడాలి…

Anusha V

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp