Bigg Boss OTT Telugu : నోరు తెరిస్తే బూతు వస్తది నాకు.. నేనింతే అంటున్న సరయు
Bigg Boss OTT Telugu : సరయు.. సోషల్ మీడియా స్టార్. అంతేనా కాదు కాదు.. తను చాలా స్ట్రెయిట్ ఫార్వార్డ్. తన స్ట్రెయిట్ ఫార్వార్డ్ తనమే తనను సెలబ్రిటీని చేసింది. తను మాట్లాడితే చాలు.. నోరు తెరిస్తే చాలు బూతులే వస్తాయి. ఆ విషయం అందరికీ తెలుసు. తను బూతులు మాట్లాడుతుంది. నిజానికి.. అదే తనను బిగ్ బాస్ లోకి రప్పించింది. అంతే కాదు.. తను ఏ విషయం గురించి మాట్లాడినా ఎవ్వరితో మాట్లాడిన అక్కడ గొడవ కావాల్సిందే.బిగ్ బాస్ లో కావాల్సింది అందరికీ అదే. అందుకే తనకు బిగ్ బాస్ 5 లో అవకాశం ఇచ్చారు. కానీ.. తనను ప్రేక్షకులు మాత్రం స్వీకరించలేకపోయారు. వారం రోజుల్లోనే తనను హౌస్ నుంచి పంపించేశారు.

sarayu controlling herself in bigg boss ott telugu
Bigg Boss OTT Telugu : మరోసారి సరయుకు బిగ్ బాస్ ఎందుకు అవకాశం ఇచ్చాడు?
అయినప్పటికీ.. బిగ్ బాస్ సరయుకు రెండోసారి బిగ్ బాస్ లో అవకాశం ఇచ్చాడు. దానికి కారణం ఏమై ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. తను మాట్లాడితే బూతులు ఉంటాయి. తను ఎక్కడ ఉంటే అక్కడ గొడవలు ఉంటాయి.ఈ సీజన్ లో రావడంతోనే సరయు చాలా మందితో అప్పటికే గొడవలు పెట్టేసుకుంది. కొందరితో గొడవలు వచ్చాయి. ఏడుపులు, పెడబొబ్బులు కూడా అయ్యాయి. హమీదాతో గొడవ పెట్టేసుకుంది సరయు.
చివరకు.. నేను బయట ఎలా ఉన్నానో.. ఇక్కడ అలా ఉండలేకపోతున్నాను అంటూ ఆర్జే చైతూ ముందు వాపోయింది సరయు. నేను ఎలా ఉన్నానో.. అలా ఉండాలంటే కష్టం అవుతోంది. ఎందుకంటే నేను నోరు తెరిస్తే నాకు బూతులే వస్తాయి అంటుంది సరయు.నేను ఇక్కడ బూతులు మాట్లాడలేకపోతున్నా. నేను ఎందుకు ఇలా ఉండాలో నాకు అర్థం కావడం లేదు.. అంటూ సరయు హౌస్ లో ఏడ్చేసింది. అంటే.. సరయు తను ఎంత స్ట్రెయిట్ ఫార్వార్డో అలాగే ఇంట్లో ఉండలేకపోతోందని తన బాధను పట్టే అర్థం అవుతోంది.మరి.. దేనికోసం అయితే సరయును ఈ షోలోకి మళ్లీ తీసుకొచ్చారో అది మళ్లీ నెరవేరుతుందా లేదా? అనేది తెలియాలంటే తర్వాత ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.