Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. తాజాగా ఈ మూవీకి సంబంధించిన న్యూస్ ఒకటి వచ్చి వైరల్ అవుతోంది. రిలీజైన రోజు నుంచి ఈ సినిమాకు డివైడ్ టాకె వచ్చింది. అయినా మేకర్స్ మాత్రం భారీ హిట్ అని మహేశ్ కెరీర్‌లోనే అత్యంత వేగంగా వసూళ్ళు రాబట్టిన సినిమా అంటూ ఊదరగొడుతున్నారు. ఇదే ఇప్పుడు కొత్తగా న్యూస్ వచ్చి వైరల్ అవడానికి కారణం అంటున్నారు. సాధారణంగా ఒకపుడు సినిమా రిలీజైన తర్వాత మొదటి ఒకటి రెండు రోజులకే హిట్టా ఫట్టా తేలిపోయేది.
కానీ, ఇప్పుడు అలా కాదు. దొరికింది సోషల్ మీడియా అని ముందు బ్లాక్ బస్టర్, భారీ హిట్ అని జనాలను నమ్మించి థియేటర్స్‌కు రప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. జనాలు ఫ్లాప్ అని అంటున్నా కూడా దర్శక, నిర్మాతలు మాత్రం బ్లాక్ బస్టర్ అని పోస్టర్ డిజైన్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఓ నెల తర్వాత నెమ్మదిగా ఆశించిన వసూళ్ళు రాలేదని..సినిమా ఫ్లాపని కన్‌ఫర్మ్ చేసేస్తారు. ఇదొక స్ట్రాటజీ అయిపోయింది. సర్కారు వారి పాట సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుందా..! అనే సందేహాలు అందరిలోనూ కలుగుతున్నాయి.
దీనికి కారణం ఈ సోమవారం నాటికి కలెక్షన్స్ చాలా వరకు డ్రాపయ్యాయి. ఇది పాన్ ఇండియన్ సినిమా కాదు. మిగతా భాషలలో కూడా రిలీజ్ కాలేదు. కేవలం ఒక్క తెలుగులోనే రిలీజైంది. అయినా ఆర్ఆర్ఆర్ సినిమా మొదటి రోజు రాబట్టిన రేంజ్‌లో సర్కారు వారి పాట వసూళ్ళు కూడా వచ్చాయని ప్రేక్షకుల్లో పలు సందేహాలు కలుగుతున్నాయి. నిజమే, ఆదివారం తర్వాత సర్కారు వారి పాట సినిమాకు సంబంధించి జనాలలో పెద్దగా టాక్ వినిపించలేదు. మరి ఇలాంటి సినిమా బ్రేకీవెన్ టార్గెట్ రీచ్ అవడం కష్టమే అంటున్నారు. మరి ఒరిజినల్‌గా వసూళ్ళు ఏ మేరకు వచ్చాయో మేకర్స్ వెల్లడిస్తే గానీ, తెలియదు. ఏదేమైనా ఫైనల్ రన్‌లో సర్కారు వారి పాట టాక్ యావరేజ్ అని డిసైడవుతుందని అంటున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.