sarkaru vaari paata : స‌ర్కారు వారి పాటకి లీకులు స‌మ‌స్య‌.. మూవీ నుండి లీకైన మ‌రో సాంగ్

Authored By Sam C | The Telugu News | Published on: March 20, 2022, 1:30 pm

sarkaru vaari paata : ప్ర‌స్తుతం సెట్స్‌పై ఉన్న బ‌డా చిత్రాల‌లో స‌ర్కారు వారి పాట ఒక‌టి. ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్‌, రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. మే 12న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మార్చి 20న ఈ సినిమా నుంచి ఎవ్‌రీ పెన్నీ సాంగ్‌ను విడుద‌ల చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సాంగ్ నుంచి ప్రోమోను ముందుగానే విడుద‌ల చేశారు. కళావతి పాట సక్సెస్ కావడంతో నెక్స్ట్ మహేష్ బాబు క్యారెక్టర్ ను హైలెట్ చేసే విధంగా పాటను విడుదల చేయబోతున్నారు.

పెన్ని సాంగ్ కు సంబంధించిన ప్రోమోలో మహేష్ బాబుతో పాటు సీతారా కూడా హైలెట్ గా నిలవడం విశేషం. ఇక ఆ పాటను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సీతారా స్టీలింగ్ ద షో అని వివరణ ఇచ్చారు. మ‌రి కొద్ది నిమిషాల‌లో పెన్నీ సాంగ్ విడుద‌ల కానుంది. అయితే అఫీషియ‌ల్‌గా రిలీజ్ చేయ‌డానికంటే ముందే ఈ సాంగ్ గానాలో లీక్ అయిన‌ట్టు తెలుస్తుంది. నిర్మాత‌లు స‌రైన జాగ్ర‌త్తలు తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల‌నే లీకుల స‌మ‌స్య వ‌స్తుంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుండి ప‌లు లీక్స్ వ‌చ్చాయన్న విష‌యం తెలిసిందే.

sarkaru vaari paata penny song leaked

sarkaru vaari paata penny song leaked

sarkaru vaari paata  : లీకుల స‌మ‌స్య ఏంది?

సర్కారు వారి పాట సినిమా వ్యవహారం ఆది నుంచీ గందరగోళంగానే వుంది. లీకులు వగైరా సంగతులు ఒకపక్క. స్క్రిప్ట్ సరిగ్గా రాలేదని, సెకండాఫ్ మళ్లీ వండుతున్నారనే వార్తలు ఇంకోపక్క వినవస్తూనే వున్నాయి. రెండు నెలల క్రితం నుంచి ఈ గ్యాసిప్ లు వినిపించడం గట్టిగా మొదలైంది. అప్పటి వరకు జ‌రిగిన షూటింగ్ పరిస్థితి సమీక్షించి తొలిసారిగా మహేష్ డైరక్టర్ మీద చాలా సీరియస్ అయ్యాడని వార్తలు వినిపించాయి. స్క్రిప్ట్ పక్కాగా రెడీ చేసి కానీ తనకు కనిపించవద్దని డైరక్టర్ ను ఆదేశించాడని టాక్ వచ్చింది. ఈలోగా ఫైటింగ్ సీన్లు తాను చేసుకుంటా అని, డైరెక్టర్ లేకుండానే చేసుకున్నారని వినిపించింది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp