Sarkaru Vaari Paata : ర‌ఫ్ఫాండిచేశాడుగా.. స‌ర్కారు వారి పాట ట్రైల‌ర్ అదిరిందంతే..!

Authored By Sam C | The Telugu News | Updated on: May 2, 2022, 4:26 pm

Sarkaru Vaari Paata : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ప‌ర‌శురాం తెర‌కెక్కిస్తున్న చిత్రం స‌ర్కారు వారి పాట‌. ఈ చిత్రం మే 12వ తేదీన విడుదల కాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. గీత గోవిందం దర్శకుడు పరుశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఒక బ్యాంక్ రికవరీ ఏజెంట్ గా నటిస్తున్నాడు. తాజాగా చిత్రం విడుద‌లైంది. ఇందులో మ‌హేష్ లుక్స్, ఆయ‌న స్టైల్, సెటైర్స్ అదిరిపోయాయి. నా ప్రేమ ను దొంగిలించగ‌లవు.

నా స్నేహాన్ని దొంగిలించ‌గ‌ల‌వు. నా డ‌బ్బుల‌ని దొంగిలించ‌లేవు అంటూ మ‌హేష్ చెప్పిన డైలాగ్స్ ఆక‌ట్టుకునేలా ఉన్నాయి.దిమ్మ తిరిగింది…ట్రైల‌ర్ చూస్తుంటే సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప‌క్కా హిట్ కొడుతుంద‌నిపిస్తుంది. ఈ సినిమా పాటలకు ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కళావతి పాట ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పాటలు అఫీషియల్ గా విడుదల చేయడం కంటే ముందే సోషల్ మీడియాలో లీకయ్యాయి. ఇక సోమవారం రావాల్సిన ట్రైలర్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata

ట్రైలర్ కు సంబంధించిన కొన్ని సీన్స్ ఎడిటింగ్ జరుగుతున్నప్పుడే మొబైల్ తో వీడియో తీయ‌గా, రిలీజ్‌కి ముందే బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి.మ‌హేష్ బాబు చేతిలో తాళాల గుత్తి పట్టుకునే విలన్స్ ను కొడుతున్న సీన్ వైరల్ గా మారింద‌.కీర్తి సురేష్‌తో రొమాన్స్ కూడా అదిరింది. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన హీరోయిన్ కీర్తి సురేష్ ఆడిపాడింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించారు. మే 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp