Sathyaraj : పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చిన కట్టప్ప | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sathyaraj : పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చిన కట్టప్ప

 Authored By ramu | The Telugu News | Updated on :26 June 2025,1:10 pm

ప్రధానాంశాలు:

  •  పవన్ కళ్యాణ్ పై ఇన్ డైరెక్ట్ గా ఎటాక్ మొదలుపెట్టిన సత్యరాజ్

  •  తమిళ్ ప్రజలను మోసం చేయలేరంటూ పవన్ పై నటుడు సత్యరాజ్ ఫైర్

Sathyaraj : తమిళ సినీ నటుడు సత్యరాజ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఇటీవల తమిళనాడులో దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం తప్పని, దానికి తమిళ ప్రజలు భయపడరని స్పష్టం చేశారు. “మేము పెరియార్ సిద్ధాంతాల మీద నమ్మకమున్నవాళ్ళం. మమ్మల్ని మతం పేరుతో మోసం చేయాలనుకోవడం వృథా. దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేయాలనుకుంటే ఊరుకోం” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Sathyaraj పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చిన కట్టప్ప

Sathyaraj : పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చిన కట్టప్ప

Sathyaraj : తమిళ్ ప్రజలను మోసం చేయలేరంటూ పవన్ పై నటుడు సత్యరాజ్ ఫైర్

పవన్ కళ్యాణ్ ఇటీవల తమిళనాడులో హిందూత్వ అంశాలపై చేసిన వ్యాఖ్యలు, భక్తి-భావనలపై ప్రసంగాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. దీనిపై స్పందించిన సత్యరాజ్ “తమిళ ప్రజలు తెలివైనవారు, ఏ అంశాన్ని విశ్లేషించకుండా నమ్మే వారు కారు. వారు బురిడీ కొట్టే జనతా కారు” అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలు తమిళ సమాజాన్ని ఉద్దేశించి చేయడం సరైంది కాదని ఆయన స్పష్టం చేశారు.

సత్యరాజ్ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళ రాజకీయ, సినీ వర్గాల్లో చర్చకు దారితీయగా, పవన్ కళ్యాణ్ స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇది రెండు రాష్ట్రాల రాజకీయాల్లో మాటల యుద్ధానికి దారి తీసే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా సత్యరాజ్ గతంలోనూ మతపరమైన వ్యాఖ్యలపై బహిరంగంగా మాట్లాడిన ఘాటు స్వభావంతో ప్రసిద్ధి. ఈ సందర్భంలో కూడా ఆయన తన స్థైర్యాన్ని చాటుతూ, తమిళనాట మత రాజకీయాలకు తావులేదని తేల్చి చెప్పారు. ఇక తెలుగు లో బాహుబలి మూవీ తో కట్టప్ప గా వరల్డ్ వైడ్ గా సత్యరాజ్ పాపులర్ అయ్యాడు. ఇప్పటికి సత్యరాజ్ అంటే చాలామందికి తెలియదు కట్టప్ప అనగానే గుర్తుపడతారు. ఆ రేంజ్ లో ఆ పాత్ర ఆకట్టుకుంటుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది