Bigg Boss 8 Telugu : అప్పుడే బిగ్ బాస్ హౌజ్‌లో గొడవలు.. ఆయన అంత మాట అన్నాడేంటి ?
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 మొదలైంది. ఇండియాలోని మిగిలిన భాషల కంటే ఎక్కువ రెస్పాన్స్‌తో సత్తా చాటుతోన్న ఈ తెలుగు రియాలిటీ షో… విజయవంతంగా సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోంది. దీంతో నిర్వహకులు కూడా రెట్టించిన ఉత్సాహంతో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇలా ఇప్పుడు ఎనిమిదో దాన్ని నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో నామినేషన్స్ టాస్కు విషయంలో బిగ్ బాస్ టీమ్ సంచలన నిర్ణయం తీసుకుందట. కంటెస్టెంట్లు.. […]
ప్రధానాంశాలు:
Bigg Boss 8 Telugu : అప్పుడే బిగ్ బాస్ హౌజ్‌లో గొడవలు.. ఆయన అంత మాట అన్నాడేంటి ?
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 మొదలైంది. ఇండియాలోని మిగిలిన భాషల కంటే ఎక్కువ రెస్పాన్స్‌తో సత్తా చాటుతోన్న ఈ తెలుగు రియాలిటీ షో… విజయవంతంగా సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోంది. దీంతో నిర్వహకులు కూడా రెట్టించిన ఉత్సాహంతో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇలా ఇప్పుడు ఎనిమిదో దాన్ని నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో నామినేషన్స్ టాస్కు విషయంలో బిగ్ బాస్ టీమ్ సంచలన నిర్ణయం తీసుకుందట. కంటెస్టెంట్లు.. ప్రీమియర్ ఎపిసోడ్ ఇవన్నీ పక్కనపెడితే.. ఎనిమిదో సీజన్‌లో గతంలో ఎన్నడూ చూడని కొత్త ట్విస్టులు, టాస్కులు ఉంటాయని హోస్ట్ నాగార్జున ముందుగానే వెల్లడించాడు.
Bigg Boss 8 Telugu : నామినేషన్ రచ్చ..
అందుకు తగ్గట్లుగానే ప్రారంభ ఎపిసోడ్ అంతా కొత్తగానే సాగుతోంది. మరీ ముఖ్యంగా ఈ సీజన్‌కు కెప్టెన్సీని తీసేశారు. అలాగే, రేషన్‌లోనూ కండీషన్స్ పెట్టారు. ఇలా చాలా మార్పులు చేశారు. తొలివారం నామినేషన్స్ హీట్ మామూలుగా లేదు. హౌస్‌లోకి వెళ్లిన రోజే.. నామినేషన్స్ స్టార్ట్ కాకుండానే వీళ్లు తిట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఆల్రెడీ కన్నడ బ్యాచ్ గ్రూప్ ఫామ్ చేసేసి గ్రూప్‌గా ఆడుతున్నారు. తెలుగు వాళ్లని సైడ్ వేస్తున్నాడు. తొలివారం నామినేషన్స్‌లో కూడా కన్నడ ఫేవరిజం కనిపించింది.నిఖిల్ ఫేవరిజమ్ చూపించి బాగా ఆడిన ఆఫ్రిదిని పక్కనపెట్టి మరీ.. యష్మీ గౌడని చీఫ్‌గా ఎంచుకున్నాడు. ఆమె ఏం ఉద్దరించిందిరా అయ్యా.. ఆఫ్రిది కదా బాగా ఆడింది అంటే.. ‘లెట్ మి గైస్.. లెట్ మీ గైస్ అని అరుస్తున్నాడు తప్పితే.. అసలు విషయం మాత్రం చెప్పలేదు.
ఇంక చెప్పేది ఏముందిలే.. వాళ్లూ వాళ్లూ ఒక బ్యాచ్ కాబట్టే చీఫ్‌ని చేసేశాడు. కాబట్టి.. చీఫ్ అయిన వాళ్లకి నామినేషన్స్ నుంచి ఇమ్యునిటీ లభించడంతో.. నిఖిల్, యష్మీ గౌడ, నైనికలు చీఫ్‌లు అయిపోయారు. నైనిక అయితే.. పెర్ఫామెన్స్‌తో చిరుతలా విజృభించింది. నామినేషన్స్ అనగానే.. భయంతో గుడ్లు తేలేసేశాడు నాగ మణికంఠ. చివరికి పాపం హౌస్‌లో అతనే టార్గెట్ అయ్యాడు. మూకుమ్మడిగా అతనికే ఎక్కువ నామినేషన్స్ గుద్ది పారేశారు. నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా.. ఫస్ట్ బేబక్కను నామినేట్ చేసింది సోనియా ఆకుల. కుకింగ్ హెడ్‌గా ఉన్న.. బేబక్క బాధ్యతల్ని సరిగా నిర్వర్తించలేదని చెప్పి నామినేట్ చేసింది ఆకుల. ఇక వాళ్లిద్దరి నామినేషన్ జరుగుతుండగా.. కన్నడ బ్యాచ్ నిఖిల్, యష్మీలు మధ్యలోకి దూరిపోయారు. దాంతో ఇచ్చిపడేసింది ఆకుల. ఇది నా నామినేషన్స్.. మీరు చెప్తే నేను వినాల్సిన పనిలేదు అంటూ కౌంటర్ ఇచ్చింది.