Shakeela : 23 ఏళ్లకే అన్నీ అయిపోయాయి.. అన్నీ చూపించేశా.. ఇప్పుడేం చేయను ఇక.. షకీలా సంచలన వ్యాఖ్యలు

Authored By Breaking News 2 | The Telugu News | Published on: March 10, 2023, 10:20 am

Shakeela : సీనియర్ నటి షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా? అవసరం లేదు కదా. ఆమెను అందరూ ఆ తార అంటూ పిలచేవారు. నిజానికి.. అప్పట్లో షకీలా పేరు ఒక సంచలనం. ఆ పేరు వింటే కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. తనను చూసి ఏ కుర్రాడు అప్పట్లో తట్టుకోలేకపోయేవాడు. అంతటి అందం తన సొంతం. పలు చిత్రాల్లో ఆ తారగా పేరు పొందిన షకీలా.. సౌత్ ఇండియా ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపింది. అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరోయిన్ కూడా తనే.

senior actress shakeela comments about her cinema career

senior actress shakeela comments about her cinema career

తను ఇప్పటి వరకు వందకు పైగా సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సినిమాల్లో నటించింది.ఇండస్ట్రీలో కొన్నేళ్లకే కనుమరుగు అయిన షకీలా.. ఆ తర్వాత చాలా బాధలు అనుభవించింది. కొన్నేళ్ల పాటే తను ఇండస్ట్రీలో ఇమడగలిగింది. ఆ తర్వాత తను ఫేడ్ అవుట్ అయింది. 16 ఏళ్లకే తను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అన్నీ చూపించేసింది. ఆ తారగా పేరు పొందింది. తనను అందరూ అదే కోణంలో చూశారు కానీ.. తనలో ఒక నటి ఉంది అని మాత్రం ఎవ్వరూ గుర్తించలేకపోయారు.

senior actress shakeela comments about her cinema career

senior actress shakeela comments about her cinema career

Shakeela : షకీలా జీవితం ఆధారంగా బయోపిక్

అయితే.. షకీలా జీవితం ఆధారంగా ఒక బయోపిక్ కూడా వస్తోంది. అందుకే ఇప్పుడు అందరూ షకీలా గురించి మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 23 ఏళ్లకే అన్నీ చూపించేశా. అప్పటికే అన్నీ అయిపోయాయి. నేను ఆ పని చేయడానికి కారణమే మా అమ్మ. ఆమె నన్ను ఎలాగోలా డబ్బులు సంపాదించే ఒక బొమ్మలా చూసింది. నేను డబ్బులు సంపాదిస్తే మంచిగా చూసేది. లేదంటే నన్ను తక్కువగా చూసేది. 23 ఏళ్లకే అంతా చూపించేయడంతో.. ఇప్పుడు చూపించడానికి ఏం లేదు. ఇకనైనా నేను మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటున్నా అంటూ షకీలా చెప్పుకొచ్చింది.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp