SR NTR : సీనియర్ ఎన్టీఆర్ కు ముందు హీరో పాత్ర ఇవ్వని ఎల్వీ ప్రసాద్.. చిన్న పాత్ర ఎందుకు ఇచ్చారంటే… వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

SR NTR : సీనియర్ ఎన్టీఆర్ కు ముందు హీరో పాత్ర ఇవ్వని ఎల్వీ ప్రసాద్.. చిన్న పాత్ర ఎందుకు ఇచ్చారంటే… వీడియో

SR NTR : ముందు హీరోగా అనుకున్నా.. చిన్న పాత్రలో తొలి సారి ఎన్టీఆర్ ను నటింపజేసిన ఎల్వీ ప్రసాద్.. ఆ సినిమాతోనే సినీరంగ ప్రవేశం చేసిన ఎన్టీఆర్ డ్రామా ఆర్టిస్ట్ గా సినీ రంగంలోకి అడుగు పెట్టారు సీనియర్ ఎన్టీఆర్. ఎల్వీ ప్రసాద్ తీసే మన దేశం సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం రామారావు.. విజయవాడ నుంచి మద్రాస్ లో అడుగు పెట్టారు. రాఘవ అనే ఒక నిర్మాత.. రైల్వే స్టేషన్ కు వెళ్లి విజయవాడ […]

 Authored By gatla | The Telugu News | Updated on :18 December 2022,11:40 am

SR NTR : ముందు హీరోగా అనుకున్నా.. చిన్న పాత్రలో తొలి సారి ఎన్టీఆర్ ను నటింపజేసిన ఎల్వీ ప్రసాద్.. ఆ సినిమాతోనే సినీరంగ ప్రవేశం చేసిన ఎన్టీఆర్ డ్రామా ఆర్టిస్ట్ గా సినీ రంగంలోకి అడుగు పెట్టారు సీనియర్ ఎన్టీఆర్. ఎల్వీ ప్రసాద్ తీసే మన దేశం సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం రామారావు.. విజయవాడ నుంచి మద్రాస్ లో అడుగు పెట్టారు. రాఘవ అనే ఒక నిర్మాత.. రైల్వే స్టేషన్ కు వెళ్లి విజయవాడ నుంచి మద్రాస్ కు చేరుకున్న రామారావును రిసీవ్ చేసుకొని ఎల్వీ ప్రసాద్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆరోజే మన దేశం షూటింగ్ మొదలైంది. వెంటనే ఎన్టీఆర్ కానిస్టేబుల్ వేషం వేసుకొని ఇంత కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి ఈ స్థాయి ఎదిగాను అనే డైలాగ్ చెబుతారు. ఈ డైలాగ్ ఆయన జీవితానికే వర్తించింది. ఆయన సినీ రంగంలోకి అడుగుపెట్టి చెప్పిన తొలి డైలాగ్ అదే. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించిన నందమూరి తారక రామారావు మనదేశం సినిమాతోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించారు.

విజయవాడలోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఇంటర్ లో చేరిన ఎన్టీఆర్ అక్కడ వేసిన ఓ నాటకంతోనే ఆయనలో ఒక మహా నటుడు ఉన్నారని అందరికీ తెలిసింది. ఇంటర్ లో ఆయన ఫెయిల్ అవడంతో పలు ఉద్యోగాలు చేశారు. వ్యాపారాలు చేశారు కానీ.. అవేవీ కలిసి రాలేదు. చివరకు ఇంటర్ ను పూర్తి చేసిన తర్వాత బీఏలో చేరారు. బీఏ చదువుతున్న సమయంలో పలు నాటకాల్లో నటించారు ఎన్టీఆర్. ఆయన వేసిన చేసిన పాపం అనే నాటకాన్ని చూసిన ఎల్వీ ప్రసాద్.. ఎన్టీఆర్ కు సినిమాల్లో అవకాశం ఇస్తా అని మాటిచ్చారు. బీఏ పూర్తయ్యాక.. విజయవాడ వచ్చిన ఎల్వీ ప్రసాద్.. రామారావును కలిసి ఆడిషన్ కు రావాలన్నారు. దీంతో అక్కడికి వెళ్లారు ఎన్టీఆర్. ఆయన ఫోటోలు తీసుకొని వెళ్లి 10 రోజుల తర్వాత శ్రీమతి సినిమా కోసం స్క్రీన్ టెస్ట్ కోసం మద్రాస్ కు రమ్మన్నారు. దీంతో అక్కడికి వెళ్లారు. ఎంపిక కూడా అయ్యారు కానీ.. ఆ సినిమా వాయిదా పడింది.

senior ntr first movie mana desam directed by lv prasad

senior ntr first movie mana desam directed by lv prasad

దీంతో గుంటూరుకు వెళ్లి సబ్ రిజిస్ట్రార్ గా ఉద్యోగంలో చేరారు.కొద్ది రోజుల తర్వాత ఎల్వీ ప్రసాద్ దగ్గర్నుంచి మళ్లీ ఎన్టీఆర్ కు లెటర్ వచ్చింది. బీఏ సుబ్బారావు గారు పల్లెటూరు పిల్ల సినిమా తీస్తున్నారు. మీరు రావాలి అని అందులో రాసి ఉంది. దీంతో కొన్ని రోజుల పాటు తన ఉద్యోగానికి సెలవులు పెట్టి మద్రాస్ వెళ్లి ఎల్వీ ప్రసాద్ ను కలిశారు రామారావు. బీఏ సుబ్బారావుకు పరిచయం చేయడంతో పల్లెటూరు పిల్ల సినిమాలో రామారావును హీరోగా పెడతా అని సుబ్బారావు.. ఎల్వీ ప్రసాద్ కు చెప్పడంతో ఇప్పుడే హీరో క్యారెక్టర్ వద్దు.. ముందు ఏదైనా చిన్నపాత్ర ఇద్దాం అంటాడు ఎల్వీ ప్రసాద్.తను తీసే మన దేశం సినిమాలో ఒక చిన్న పాత్రను ఇచ్చారు ఎల్వీ ప్రసాద్.

ఇంతలో ఉద్యోగం మానేసి తిరిగి మద్రాస్ వచ్చి ముందు మన దేశం సినిమాలో కానిస్టేబుల్ పాత్రలో నటించారు ఎన్టీఆర్. ఆ పాత్రలో ఎన్టీఆర్ లాఠీ చార్జీ చేయాల్సి ఉంటుంది. లాఠీ పట్టుకొని షూటింగ్ లో పాల్గొన్న వాళ్లందరి వీపులు వాయించారట. ఎన్టీఆర్ ప్రవర్తనపై కొంత మేరకు ఎల్వీ ప్రసాద్ అసహనానికి గురయినప్పటికీ.. నటనలో ఆయనకు ఉన్న పట్టుదల, అంకితభావాన్ని అర్థం చేసుకొని అందరూ ఎన్టీఆర్ లోని నటుడినే చూశారు. సుబ్బారావు కూడా ఎన్టీఆర్ అంకితభావాన్ని గ్రహించి.. పల్లెటూరు పిల్ల సినిమాకు హీరోగా ఎంపిక చేశారు. అలా.. ఎన్టీఆర్ సినీ రంగంలోకి ప్రవేశించి చివరకు తెలుగు ఇండస్ట్రీలోనే ఒక చరిత్ర సృష్టించారు. తెలుగు ఇండస్ట్రీకే ఒక దారి చూపించారు.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది