Serial Actress Karuna : నన్ను చాలామంది మోసం చేశారు.. వాళ్లను గుడ్డిగా నమ్మాను.. సీరియల్ నటి కరుణ భావోద్వేగం
Serial Actress Karuna : సీరియల్ నటి కరుణ మీకు తెలుసా? తను సినిమాల్లోనూ నటించింది. తను అచ్చమైన తెలుగమ్మాయి. మొగలి రేకులు సీరియల్ గురించి తెలిసిన వాళ్లకు కరుణ సుపరిచితమే. తన పూర్తి పేరు కరుణ భూషణ్. తను అచ్చం మన పక్కింటి అమ్మాయిలా కనిపిస్తుంది. తను చాలా సినిమాల్లో నటించినా మొగలి రేకులు సీరియల్ ద్వారానే తనకు ఎక్కువ ఫేమ్ వచ్చింది. ప్రస్తుతం పలు సీరియల్స్ లో నటిస్తూ బిజీ బిజీ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరుణ.. తన పర్సనల్, కెరీర్ కు సంబంధించిన చాలా విషయాలను షేర్ చేసుకుంది.
తన తల్లిది ముంబై. కానీ.. కరుణ పుట్టి పెరిగింది మాత్రం హైదరాబాద్ లోనే. తను ఇప్పటి వరకు దాదాపు 30 సినిమాల్లో నటించింది. స్టార్ హీరోల సినిమాల్లోనూ నటించింది. ఆహా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది కరుణ. తనది ప్రేమ వివాహం. తన భర్త కూడా సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్. ఆయనే ప్రపోజ్ చేశాడట. అయితే.. కరుణ సినిమాల్లోకి రాకపోయి ఉంటే.. డాక్టర్ ను అయ్యేదాన్ని అని చెప్పింది. అయితే.. తన జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పింది. తనను చాలా మంది మోసం చేశారట.
Serial Actress Karuna : సినిమాల్లోకి రాకపోయి ఉంటే డాక్టర్ ను అయ్యేదాన్ని అన్న కరుణ
అప్పుడు తను చాలా బాధపడిందట. కానీ.. తనకు తానే ధైర్యం చెప్పుకుందట.. జీవితంలో ముందుకు సాగుతూ ఉందట. అప్పటి నుంచి జీవితంలో ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకూడదని కరుణ నిర్ణయించుకుందట. కానీ.. తన భర్త మాత్రం చాలా సపోర్టివ్ గా ఉంటాడట. తనను చాలా బాగా చూసుకుంటూ ఉండటంతో తన జీవితానికి ప్రస్తుతం ఎలాంటి డోకా లేదని చెప్పింది. ప్రస్తుతం కరుణ.. ఒక వెబ్ సిరీస్ లో నటించింది. తనకు అవకాశాలు వస్తే సినిమాల్లో నటించడానికి ఎప్పుడూ రెడీగా ఉంటుంది కరుణ. కాకపోతే జీవితంలో చాలామంది మోసాలు చేయడం వల్ల తన కెరీర్ కాస్త వెనక్కి వెళ్లిపోయింది.