shanmukh : అమ్మో పెద్ద ప్లానే ఇది..షణ్ముఖ్ ని తొక్కి, సన్నీని పైకి లేపుతోన్న బిగ్ బాస్ టీమ్..!
shanmukh : బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ ఎవరో తేలడానికి మరో నాలుగు రోజులే మిగిలి ఉంది. 100వ ఎపిసోడ్‌లో భాగంగా శ్రీరామ్, మానస్‌ల జర్నీ వీడియో ఎమోషనల్‌గా సాగితే.. ఇక నిన్నటి ఎపిసోడ్ లో షన్ను, సన్నీ ల జర్నీ ని చూపించారు బిగ్ బాస్. అయితే గత రాత్రి ఏపిసొడ్ లో బిగ్ బాస్ టీమ్.. షన్ను జర్నీని కావాలనే తక్కువ చేసి చూపి… సన్నీకి వాంటెడ్ గా హైప్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేసిందని షన్ను అభిమానులు ఫైర్ అవుతున్నారు. మొదటి నుంచి భారీ ఫాలోయింగ్ ఉన్న షన్నుని మాత్రం కావలనే తొక్కేస్తూ వచ్చారా అనే చర్చ నడుస్తోంది ప్రస్తుతం. అందుకే గత రాత్రి జరిగిన ఏపిసొడ్ నిదర్శనంగా నిలుస్తోంది.షణ్ముఖ్ జర్నీలో అతనికి సంబంధించిన చాలా వరకూ ఫొటోలు మోజ్ రూంవే ఉండటం, అందునా షణ్ముఖ్-సిరి బంధంపై బయట నెగిటివిటి వస్తున్నా.
అవేమీ తెలియనట్టుగా ఓన్లీ వారిద్దరి ఫొటోస్ పైనే దృష్టి పెట్టడం బిగ్ బాస్ ప్లాన్ అనిపించక మానదు. షన్ను కేవలం సిరి కోసమే హౌజ్ లోకి వచ్చి, గేమ్ మొత్తం తన కోసమే ఆడాడేమో అన్నట్లు నమ్మించారు. ఇక షన్ను కూడా వీటికి ఆజ్యం పోస్తూ తన తల్లి ఇంకా సిరితో కలసి ఉన్న ఫొటోని తీసుకుని వెళ్లాడు.నంతరం బిగ్ బాస్ సన్నీ జర్నీని ప్లే చేశాడు. సన్నీకి గిల్టీ బోర్డ్ వేసి అవమానించిన వీడియోతో మొదలుపెట్టి హీరో రేంజ్ కి ఎదిగి పోయాడు అన్న రీతిలో తన జర్నీని ఎడిట్ చేయించాడు. ఈ ఇంట్లో మీ బంధాలు.. గెలిచిన ఆటలు.. జరిగిన గొడవలు.. మోసిన నిందలు.. చేసిన వినోదం.. ఎన్ని ఒడుదుడుగులు వచ్చినా అందరి మొహంపై నవ్వు తీసుకుని వచ్చి ఎంటర్ టైనర్‌గా అందరి మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు.

shanmukh audience fires on Bigg Boss team over vj sunney journey video in Bigg Boss 5 Telugu
shanmukh : సన్నీకి హైప్… షన్నుకి ఫ్లాప్..!
పోరాడే పట్టుదల.. ఓర్పు మిమ్మల్ని ఇక్కడి వరకూ తీసుకుని వచ్చిందన్నారు. అన్ని ఏమోషన్స్ ను మిక్స్ చేసి.. శ్రీమంతుడు, లెజెండ్ సినిమాల్లోని పాటలతో… అప్నా టైం ఆయేగా అంటూ భారీ హైప్ ఇచ్చారు.ఇప్పటివరకు చూపించిన.. షణ్ముఖ్, శ్రీరామ్, సన్నీ, మానస్‌లలో… సన్నీకి ఎక్కువ హైప్ ఇచ్చారు బిగ్ బాస్. ఇది చూసిన అభిమానులంతా.. కావాలనే షన్ను, శ్రీ రామ్, యాంకర్ రవి వంటి వారిని అణిచి వేసి సన్నీని హీరోను చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆలస్యం చేయకుండా ఆ విన్నర్ ట్రోఫీ కూడా అతని చేతిలో పెట్టేయండని అంటున్నారు. మరో వైపు బయట పలు ప్రైవేట్ ఓటింగ్ వెబ్ సైట్లలోనూ సన్నీ మొదటి ప్లేస్‌లో దూసుకుపోతోన్నాడు. ఇదంతా చూస్తూ ఉంటే ఈసారి టైటిల్ సన్నీకి సొంతం అవుతుందేమో అనిపిస్తోంది.