Deepthi Sunaina Shanmukh : బ్రేకప్ తర్వాత అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తిన దీప్తి గురించి షణ్ముఖ్ పోస్ట్
Deepthi Sunaina Shanmukh : సమంత మరియు నాగ చైతన్యల విడాకుల ప్రకటన తర్వాత అంతటి చర్చకు తెర తీసిన అంశం ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా దీప్తి సునైన మరియు షన్నూల బ్రేకప్ అనడంలో సందేహం లేదు. యూట్యూబ్ సెలబ్రెటీలు అయిన వీరిద్దరు బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఇద్దరు కూడా వేరు వేరు సీజన్ ల్లో బిగ్ బాస్ లో కనిపించి ప్రేక్షకుల అభిమానంను దక్కించుకున్నారు. వీరికి ఉన్న పాపులారిటీ నేపథ్యంలో వీరిద్దరు బ్రేకప్ అవ్వడం పెద్ద న్యూస్ గా మారింది. సోషల్ మీడియాలో వారం పది రోజులుగా అదే రచ్చ.. చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారం ముగిసింది అనుకుంటూ ఉండగా షన్నూ చేసిన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ మళ్లీ అందరిని ఆశ్చర్యంలోకి నెట్టి వేసింది.
బ్రేకప్ తర్వాత ఎవరి లైఫ్ వారిది అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. ఈ సమయంలో ఒకరి గురించి మరొకరు మళ్లీ ఎప్పుడు మాట్లాడటం కాని కనీసం సోషల్ మీడియాలో పోస్ట్ కాని చేయక పోవచ్చు అనుకున్నారు. కాని నేడు దీప్తి సునైన పుట్టిన రోజు. ఈ సందర్బంగా షన్నూ హ్యాపీ బర్త్ డే డి అంటూ పోస్ట్ పెట్టాడు. లవ్ ఈమోజీలు.. ఇతర ఈమోజీలు ఏమీ లేకపోవడంతో ఆయన సింపుల్ గానే ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసినట్లుగా భావించవచ్చు. అంటే ఇద్దరి మద్య స్నేహం కొనసాగేందుకు గాను షన్నూ ఇలా బర్త్ డే శుభాంక్షలు తెలియజేసి ఉంటాడు అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ బర్త్ డే విషెష్ కు దీప్తి నుండి ఖచ్చతంగా స్పందన రాకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Shanmukh birthday wishes to deepthi sunaina after breakup
Deepthi Sunaina Shanmukh : సిరి మరియు షన్నూ ల ప్రేమ వ్యవహారం..
దీప్తి సునైన మరియు షన్నూ ల బ్రేకప్ కు కారణం ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో ముందు ఉండే పేరు ఖచ్చితంగా సిరి అనడంలో సందేహం లేదు. సిరి మరియు షన్ను లు బిగ్ బాస్ లో వ్యవహరించిన తీరు ఏ ఒక్కరికి నచ్చలేదు. అందుకే షన్నూ కు దీప్తి బ్రేకప్ చెప్పింది అనేది చాలా మంది మాట. అయితే కొందరు మాత్రం హౌస్ లో సిరికి షన్నూ బాగా కనెక్ట్ అయ్యాడు. అందుకే బయటకు వచ్చిన తర్వాత దీప్తి సునైన తో మాట్లాడటం ఆయన వల్ల కాలేదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో బ్రేకప్ చెప్పినట్లుగా దీప్తి సన్నిహితుల నుండి సమాచారం అందుతోంది. ఈ మొత్తం వ్యవహారం బంక సాగినట్లుగా అలా సాగుతూనే ఉండటం తో సోషల్ మీడియాలో కొందరికి పండుగలా మారింది. వారు ఈ వ్యవహారం గురించి ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తూ పోస్ట్ లు పెడుతూ సరదాగా టైమ్ పాస్ చేస్తున్నారు.

Shanmukh birthday wishes to deepthi sunaina after breakup