Deepthi Sunaina Shanmukh : సిరి వల్ల విడిపోలేదు.. వాళ్లమ్ల వల్లనే…. షణ్ముఖ్ షాకింగ్ కామెంట్స్
Deepthi Sunaina Shanmukh : యూట్యూబ్‌లో తెగ వినోదం పంచే జంటలలో షణ్ముఖ్ జస్వంత్- దీప్తి సునయన జంట ఒకటి. వీళ్లు చేసినా కవర్ సాంగ్స్.. వెబ్ సిరీస్ లు ఎంత ఫేమస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పెడుతూనే ఉన్నారు. ఇక అలా అలా వీళ్ల మధ్య ప్రేమ చిగురించి 5 యేర్స్ హ్యాపీగా గడిపారు. కెరీర్ కూడా సెటిల్ అయ్యాక పెళ్లి కూడా చేసుకుంటారని అంతా అనుకున్నారు. కాని ఊహించని విధంగా బ్రేకప్ చెప్పుకున్నారు. షణ్ముఖ్- దీప్తి బ్రేకప్ తర్వాత ఈ ఇద్దరికి సంబంధించి నిత్యం ఏదో ఒకవార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంది.
షణ్ముఖ్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. షణ్ముఖ్ మాట్లాడుతూ.. ప్రేక్షకులలో నాకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకోవడానికే రియాల్టీ షోకు వెళ్లాను. నా కానీ షో నుంచి బయటకు వచ్చాక తెలిసింది నాపై అంత నెగిటివిటీ వచ్చిందో అర్థమైంది. నేను 27 సంవత్సరాల వయసులోనే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వీటివలన ఇంకా జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలి అనేది నేర్చుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. సిరికి అండగా నిలబడడం వలన నాపై నెగెటివిటీ బాగా పెరిగింది.సిరి వాళ్ల అమ్మ మీరిద్దరు హగ్ చేసుకోవడం నచ్చలేదని చెప్పడం చాలా భాదనిపించింది.

shanmukh open up on break up with Deepthi Sunaina
Deepthi Sunaina Shanmukh : షణ్ముఖ్ బాధ వర్ణనాతీతం…
నాకు ఆమె అలా మాట్లాడటం నచ్చలేదు. సిరి వాళ్లమ్మ నా గురించి తప్పుగా అనుకోవడం తట్టుకోలేకపోయాను. దీప్తి నేను విడిపోవడానికి చాలా కారణాలున్నాయి. సిరితో చనువుగా ఉండడం వలన తన కుటుంబం నుంచి తనకు ఒత్తిడి పెరిగింది. ఇకనైన తను సంతోషంగా ఉండాలనే ఉద్ధేశంతోనే బ్రేకప్ చెప్పుకోవాల్సి వచ్చింది. సిరి వలన మేము విడిపోలేదు.సిరి, దీప్తి మంచి ఫ్రెండ్స్ . మేం కలుస్తామా లేదా అనేది దేవుడి చేతుల్లో ఉంది. విధి మా జీవితాల్లో ఏది రాస్తే అదే జరుగుతుందని నమ్ముతున్నాను అంటూ షణ్ముఖ్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.