Shanmukh : బిగ్ బాస్ ఓటీటీలో ఆ యాంకర్ కన్‌ఫాం.. అరె, ఇలా లీక్ చేశావేంట్రా షణ్ముఖ్..!
Shanmukh : ఫిబ్రవరి 26 నుండి మొదలు కానున్న బిగ్ బాస్ ఓటీటీ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్ ఓటీటీ షోలో పాల్గొనబోతున్నట్టు జోరుగా ప్రచారాలు నడుస్తున్నాయి. డిస్నీ హాట్ స్టార్‌లో బిగ్ బాస్ ఓటీటీ ప్రసారం కానుంది. 24*7 నిరంతరాయంగా ఈ షోని ప్రసారం చేయనున్నారు. హిందీలో బాగా క్లిక్ కావడంతో ఇప్పుడు తెలుగు, తమిళంలోను అలాంటి ప్రయోగం చేయబోతున్నారు. బిగ్ బాస్ ఓటీటీకి వచ్చే కంటెస్టెంట్స్ అంతా దాదాపు పాపులర్ సెలబ్రిటీలే కావడం విశేషం.. ఎవరో ఒకరిద్దరు తప్పితే మిగిలిన వాళ్లంతా క్రేజ్ ఉన్నవాళ్లనే తీసుకుని వస్తున్నారు. ఈ కంటెస్టెంట్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు.. ఈ కింది లింక్‌లో చూడొచ్చు.
ప్రస్తుతానికి అయితే 19 మందితో కూడిన లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇందులో ఎంత మంది కన్‌ఫాం అనే దానిపై అయితే క్లారిటీలేదు కాని ఓ యాంకర్ మాత్రం పక్కాగా ఓటీటీలో పాల్గొనబోతున్నట్టు షణ్ముఖ్ ద్వారా లీక్ అయింది. బిగ్ బాస్ 5లో తనకి జరిగిన ఇమేజ్ డ్యామేజ్ వల్ల.. హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత షణ్ముఖ్ ఏ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. తొలిసారిగా యాంకర్ శివకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో తన పడ్డ బాధలు, కష్ట సుఖాలు, బ్రేకప్ విషయం గురించి పలు విషయాలు మాట్లాడాడు. ఈ వీడియో యూట్యూబ్‌లో పెట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే మిలియన్ వ్యూస్ కొల్లగొట్టింది.షణ్ముఖ్‌ని యాంకర్ శివ.. బిగ్ బాస్ గురించి పలు విషయాలు అడిగాడు.

shanmukh leaks the bigg boss contestant name
Shanmukh : అలా సమాచారం లీకైంది…
ఆ సమయంలో త్వరలో నీకు తెలుస్తుంది అన్నట్టుగా నవ్వేశాడు షణ్ముఖ్. అంతేకాదు.. మరో సందర్భంలో శివ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తున్నట్టు చెప్పకనే చెప్పాడు షణ్ముఖ్. ఇంటర్వ్యూల కోసం ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయలేదంట.. ఎందుకు? స్పేస్ కావాలన్నావట ఎందుకు అని శివ అడగడంతో.. ‘ఇంటర్వ్యూల కోసం అడిగితే స్పేస్ కావాలన్నాను.. నేను ఎందుకు కావాలన్నానో నీకు త్వరలో అర్ధం అవుతుంది.. చూసే వాళ్లకి కూడా అర్ధం అవుతుంది.. అని నవ్వేశాడు. ఇక చివర్లో అయితే.. యాంకర్ శివని ఉద్దేశించి.. ఏదైనా అడగాలి అనుకుంటే ఇప్పుడే అడిగేయండి.. నెల తరువాత ఎలాగూ కనిపించడు’ అని షణ్ముఖ్ అనడంతో.. యాంకర్ శివ బిగ్ బాస్‌కి వెళ్లడం ఖాయం అని తేలింది.