Shanmukh : ఫేవరేట్ హీరోని కలిసిన ఆనందంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్న షణ్ముఖ్
Shanmukh: యూట్యూబర్‌గా షణ్ముఖ్ చాలా మందికి సుపరిచితం. ఇక బిగ్ బాస్ సీజన్ 5లో రన్నర్‌గా నిలిచిన షణ్ముఖ్ అశేష ప్రేక్షకాదరణ పొందాడు. ప్రస్తుతం తన తరువాతి ప్రాజెక్ట్స్‌పై దృష్టి పెట్టిన షణ్నూ.. తన కల నెరవేరింది అంటూ పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్‌గా మారింది. ఇన్నాళ్లు షణ్ముఖ్ కన్నకల నిజమైంది. తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో సూర్యని కలిసి ఆ ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. సూర్య తన తాజా చిత్రం ‘ఈటీ’తో ఈ […]
Shanmukh: యూట్యూబర్‌గా షణ్ముఖ్ చాలా మందికి సుపరిచితం. ఇక బిగ్ బాస్ సీజన్ 5లో రన్నర్‌గా నిలిచిన షణ్ముఖ్ అశేష ప్రేక్షకాదరణ పొందాడు. ప్రస్తుతం తన తరువాతి ప్రాజెక్ట్స్‌పై దృష్టి పెట్టిన షణ్నూ.. తన కల నెరవేరింది అంటూ పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్‌గా మారింది. ఇన్నాళ్లు షణ్ముఖ్ కన్నకల నిజమైంది. తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో సూర్యని కలిసి ఆ ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. సూర్య తన తాజా చిత్రం ‘ఈటీ’తో ఈ నెల 10న ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఆయన హైదరాబాద్ వచ్చి ఓ హోటల్లో దిగారు.
అక్కడే సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. అదే సమయంలో అక్కడున్న షణ్ముక్ .. తన అభిమాన కథానాయకుడిని చూసి అలాగే ఆగిపోయాడు. హీరో సూర్య కూడా షణ్ముక్‌ను గమనించారు. ఆయన మీడియాతో మాట్లాడి వచ్చిన తర్వాత వెళ్లి ప్రత్యేకంగా వెళ్లి షణ్ముక్‌ను కలిశారు. సార్ నేను మీకు పెద్ద అభిమానిని అంటూ షణ్ముక్ చెప్పగా.. నిన్ను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ సూర్య చెబుతూ షణ్ముక్‌ని కౌగిలించుకున్నారు.అభిమాన కథానాయకుడిని అనుకోకుండా కలుసుకోవడం. ఆయన కూడా షణ్ముక్‌ని చక్కగా రిసీవ్ చేసుకోవడంతో షణ్ముక్ చాలా ఎమోషనల్ అయిపోయారు. కన్నీళ్లు పెట్టుకున్నారు.
Shanmukh : షణ్ముఖ్ కల నిజమైంది..
షణ్ముక్ ఎమోషనల్ కావడానికి గమనించిన హీరో సూర్య .. భుజం తట్టి గాడ్ బ్లెస్ యు అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని షణ్ముఖ్ తన ఇన్‌స్టాగ్రాములో షేర్ చేస్తూ.. ‘‘నువ్వు ఏం కావాలని కోరుకుంటావో అది దొరక్కపోవచ్చు. కానీ.. నీకు దక్కాల్సింది, అవసరమైనది తప్పకుండా దొరుకుతంది’’ అంటూ కొటేషన్ను కూడా షేర్ చేశారు. షన్ను ఫాలో వర్స్ ‘అన్నా నీ కల నిజమైంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్‌గా షణ్ముక్ హైదరాబాద్‌లో ఓ కొత్త ఇల్లు కొనుకున్నాడు.దీనికి సంబంధించి గృహప్రవేశాన్ని సైతం పూర్తి చేశాడు. నటి, చాయ్ బిస్కెట్ ఫేం శ్రీ విద్యతో కలిసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు.