Shanmukh : యూట్యూబర్ మరణంతో కన్నీటి పర్యంతం అయిన షణ్ముఖ్, సురేఖా వాణి
Shanmukh : ఎప్పుడు ఎవరి జీవితం ఎలా మారుతుందో ఊహించడం చాలా కష్టం. అప్పటి వరకు సరదాగా గడిపిన యూట్యూబర్ గాయత్రి రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లింది. . అద్భుతమైన భవిష్యత్తు కళ్ల ముందు కనిపిస్తుండగా.. పాతికేళ్ల వయసులోనే ప్రముఖ యూ ట్యూబర్ గాయత్రి ఎకా డాలీ డీ క్రూజ్ దుర్మరణం పాలైంది. ఈమె మరణవార్త తెలుసుకుని తోటి నటీనటులు, సోషల్ మీడియా ఫ్రెండ్స్ అంతా కన్నీటి సాగరంలో మునిగిపోయారు. నిన్నటి వరకు తమతో ఉన్న గాయత్రి ఈ రోజు లేదని తెలిసి కన్నీరు పెట్టుకుంటున్నారు. మరోవైపు ఈమె మరణంపై ప్రముఖ నటి సురేఖ వాణి కూడా సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేసింది.
గాయత్రి, రోహిత్ శుక్రవారం హోలీ సందర్భంగా ప్రిసం పబ్ కి వెళ్లారు అని తిరిగి వెళ్లే క్రమంలో కారు అతి వేగంతో ప్రయాణించడం వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు సిసి టీవీ ఫుటేజ్ ద్వారా తేల్చారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు 100-120 కిమీ వేగంతో ప్రయాణిస్తోందని మాదాపూర్ పోలీసులు మీడియాకు తెలిపారు. రోహిత్ కారు డ్రైవ్ చేశాడని.. అతడి పక్క సీట్ లో గాయత్రి కూర్చుని ఉంది. కారు ఫుట్ పాత్ ని ఢీ కొట్టడంతో ముందు టైర్లు ఊడిపోయాయి. క్షణాల్లో కారు పల్టీలు కొడుతూ దూరంగా పడింది. అద్దాలు పగిలిపోవడంతో గాయత్రీ కారులో నుంచి రోడ్డుపై పడి మృతి చెందినట్లు పోలీసులు తెలుపుతున్నారు.

Shanmukh surekha vani emotional on YouTuber Gayatri death
Shanmukh : ఘోరమైన ప్రమాదం…
గాయత్రికి టాలీవుడ్ లో చాలా మందితో పరిచయం ఉంది. గాయత్రి మరణించిన వార్త తెలియడంతో నటి సురేఖ వాణి విషాదంలో మునిగిపోయారు. గాయత్రితో ఉన్న పిక్ షేర్ చేస్తూ.. ఈ అమ్మని విడిచి వెళ్లాలని ఎలా అనిపించింది అంటూ ఆమె ఎమోషనల్ కామెంట్స్ పోస్ట్ చేశారు. గతంలో సురేఖ వాణి తనకు రెండవ తల్లి లాంటివారు అని గాయత్రీ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ని సురేఖ వాణి ఇప్పుడు కోట్ చేశారు. షణ్ముఖ్ కూడా గాయత్రి మృతిపై విచారం వ్యక్తం చేశాడు. బిగ్ బాస్ 5 రన్నరప్ షణ్ముఖ్ తో గాయత్రికి మంచి స్నేహం ఉంది. ఇదిలా ఉండగా వీరి కారు పల్టీలు కొడుతూ పక్కనే ఉన్న హోటల్ మహేశ్వరి అనే మహిళపై పడింది. దీనితో ఆమె కూడా ప్రాణాలు విడిచారు.