
Sharanya Pradeep : అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ లో ఆయన వల్లే అలాంటి సీన్ చేయాల్సివచ్చింది.. శరణ్య
Sharanya Pradeep : ఫిదా సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న శరణ్య దిలీప్ ఇప్పుడు సుహాస్ నటించిన ‘ అంబాజీపేట మ్యారేజి బ్యాండు ‘ సినిమాతో స్టార్ స్టేటస్ ను అందుకున్నారు. ఈ సినిమాలో ఆమె నటనకు ఫాన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో శరణ్య పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది. తెలంగాణ అమ్మాయి అయినా శరణ్య న్యూస్ రీడర్గా కెరీర్ మొదలుపెట్టారు. ఫిదా సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. పిల్లా రేణుకగా సాయి పల్లవి అక్క పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా తర్వాత శరణ్యకు అవకాశాలు వరుసగా వచ్చాయి కానీ అంతగా గుర్తింపు రాలేదని చెప్పాలి. అయినా కూడా శరణ్య మంచి కథలను ఎంచుకొని ముందుకు సాగుతుంది.
ఇక ఇటీవల విడుదలైన అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా ఆమెను స్టార్ స్టేటస్ ను అందుకునేలా చేసింది. సుహాస్, శివాని జంటగా దుశ్యంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో సుహాస్ అక్కగా శరణ్యపాత్ర సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇందులో ఆమె ధైర్యం చేసి ఆ సీన్ కూడా నటించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ ఆ సీన్ సన్నివేశాల గురించి మాట్లాడారు. కథ చెప్పినప్పుడే డైరెక్టర్ ఆ సీన్ సన్నివేశం గురించి చెప్పారు. మొదట నేను చేయడానికి చాలా భయపడ్డాను కానీ నా భర్త ప్రోత్సాహం వలన నేను ఆ సీన్ నటించగలిగాను. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అది. ధైర్యంగా నటించు అని నా భర్త చెప్పడంతో నేను నటించగలిగాను.
ఆ సన్నివేశం చేసేటప్పుడు సెట్లో ఐదుగురు మాత్రమే ఉన్నారు. డిఓపి, డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్, అసిస్టెంట్స్, మరో వ్యక్తి ఉన్నారు. చాలా కంఫర్టబుల్గా నటించాను అని చెప్పారు. ఈ సినిమా తర్వాత శరణ్యకు మంచి మంచి పాత్రలు రావడం ఖాయం అని చెప్పవచ్చు. ఈ సినిమాతో శరణ్య పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది. ఇంతవరకు ఆమె చేసిన సినిమాలలో ఏ పాత్ర కూడా ఇంతలా హైలైట్ అవ్వలేదు. దీంతో ఆమె చేసిన ఈ పాత్రకు అభిమానుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమాతో హైలెట్గా నిలిచిన శరణ్యకు మంచి మంచి పాత్రలు వస్తాయి అనడంలో సందేహం లేదు. ఈ సినిమాకు మించి మంచి పాత్రలు వస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.
BRS | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో రాజకీయ ఉద్రిక్తత చెలరేగింది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య…
cervical Pain | నేటి ఆధునిక జీవనశైలిలో ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చోవడం, మొబైల్ ఫోన్ వాడకం పెరగడం, తప్పుడు…
Apple | రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు” ఈ మాట మనందరికీ బాగా…
Rose Petals | గులాబీ పువ్వులు అందం, సువాసనకు ప్రతీకగా నిలుస్తాయి. కానీ ఈ సుగంధ పువ్వులు కేవలం అలంకరణకు మాత్రమే…
Ivy gourd | మన రోజువారీ ఆహారంలో కూరగాయలకు ప్రత్యేక స్థానం ఉంది. వీటి ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్,…
November | నవంబర్ నెల చలికాలం ఆరంభమయ్యే ఈ సమయం ప్రకృతిలో మార్పులు తీసుకురావడమే కాదు, ఈ నెలలో జన్మించిన…
Capsicum | శీతాకాలం వచ్చేసింది. ఈ సీజన్లో చలి మాత్రమే కాదు, అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.…
Poha | ప్రతిరోజూ ఒకే రకం ఆహారం తింటూ బోర్ ఫీల్ అవుతున్నారా? అలాంటప్పుడు మీ మెనూలో అటుకులు (పోహా) ని…
This website uses cookies.