
Women : స్త్రీ కోరిక.. ఒక పురుషుడి నుండి స్త్రీ కోరుకునేది ఇదొక్కటే ..!
Women : హర్షవర్ధనుడు అనే రాజు యుద్ధంలో ఓడిపోయాడు. అతడి చేతులకు బేడీలు వేసి గెలిచిన రాజు వద్దకు తీసుకువెళ్ళారు. ఆ సమయంలో గెలిచిన రాజు సంతోషకరమైన మానసిక స్థితిలో ఉన్నాడు. అయితే రాజు హర్షవర్ధనుడిని ముందు ఒక ప్రతిపాదనను ఉంచాడు. ఆ ప్రతిపాదన ఏంటంటే మీరు నాకు ఒక ప్రశ్నకు సరిగ్గా సమాధానం ఇవ్వగలిగితే నేను మీ రాజ్యాన్ని మీకు తిరిగే ఇస్తాను. ఒకవేళ ఇవ్వలేకపోతే రాజ్యాన్ని ఇవ్వడం కాదు కదా శిక్ష కూడా అనుభవించాలి. మీరు నా దేశంలో జీవితాంతం ఖైదీగా ఉండవలసి ఉంటుంది అని అన్నాడు. ఒక స్త్రీ పురుషుడు నుండి ఏమి కోరుకుంటుంది అని ప్రశ్న అడిగారు. సమాధానం ఇవ్వడానికి మీకు ఒక నెల సమయం కేటాయిస్తున్నానని రాజు అంటాడు. దీంతో హర్షవర్ధనుడు ఆ ప్రతిపాదనను అంగీకరించాడు.వివిధ ప్రదేశాలకు వెళ్లి అనేకమంది పండితులు, బోధకులు, పూజారులు, నృత్యకారులు, వేశ్యలు, గృహిణీలు, పనిమనిషి ఇలా ఎంతోమందిని హర్షవర్ధనుడు కలుసుకున్నారు. ఆమెకు ఆభరణాలు కావాలని కొందరు, శారీరక సుఖాలు కావాలని కొందరు, ఆస్తిపాస్తులని కొందరు, మరికొందరేమో మనిషి నుండి పిల్లలను కోరుకుంటున్నారని, మరొకరు అందమైన ఇల్లు మరియు కుటుంబం అని అన్నారు. మరొకరు స్త్రీ సింహాసనం కావాలని కోరుకుంటుంది అని అన్నారు. ఈ సమాధానాలతో హర్షవర్ధనుడు అస్సలు సంతృప్తి చెందలేదు. నెల ముగిసిపోయే సమయం వచ్చింది. మరోవైపు హర్షవర్ధనుడు సంతృప్తికరమైన సమాధానాన్ని సేకరించలేకపోయాడు. అప్పుడు ఎవరో చాలా దూరంగా మరొక దేశంలో ఒక మంత్రగత్తే నివసిస్తున్నారని ఆమె అన్ని సమాధానాలు తెలిసి ఉన్నందున ఆమె మాత్రమే ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వగలదు అని సలహా ఇచ్చారు.
అప్పుడు హర్షవర్ధనుడు తన స్నేహితుడైన సిద్దిరాజ్ తోపాటు పొరుగు దేశం వెళ్లి మంత్రగత్తెను కలిశాడు. హర్షవర్ధనుడు తన ప్రశ్నను ఆమెను అడిగాడు. అందుకు మంత్రగత్తే మీ స్నేహితుడు సిద్దిరాజు నన్ను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తేనే నేను మీకు సరైన సమాధానం ఇస్తాను అని షరతు పెట్టింది. దాంతో హర్షవర్ధనుడు చాలా ఆలోచించాడు. మంత్రగత్తెను చూస్తే చాలా ముసలి దానిలాగా మరియు చాలా అంద వికారంగా ఉంది. తన స్నేహితుడికి ఇలాంటి వ్యక్తితో వివాహం అంటే మిత్రుడికి అన్యాయం చేయడమే అని ఆలోచించి సమాధానం తెలియకున్నా పరవాలేదు కానీ మిత్రుడికి నష్టం జరగాలని అతను కోరుకోలేదు. అందుకే హర్షవర్ధనుడు ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు. కానీ సిద్ధిరాజు మాత్రం తన స్నేహితుడు తన దేశ రాజు అయిన హర్షవర్ధనుడిని కాపాడడానికి మంత్రగత్తెను వివాహం చేసుకోవడానికి అంగీకారం తెలిపి వెంటనే వివాహం కూడా చేసుకున్నాడు.అప్పుడు మంత్రగత్తె హర్షవర్ధనుడికి సమాధానం ఇస్తూ ఒక స్త్రీ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటుంది. తద్వారా ఆమె స్వయంగా నిర్ణయాలు తీసుకుంటుంది అని చెబుతోంది. ఈ సమాధానంకు హర్షవర్ధనుడు సంతృప్తి చెందుతాడు. అతడు తనను గెలిచిన రాజుకు ఈ సమాధానం చెప్పాడు. రాజు సమాధానం ఒప్పుకొని హర్షవర్ధనుడిని విడుదల చేసి తన రాజ్యాన్ని అతడికి తిరిగి ఇచ్చాడు. మరోవైపు తన పెళ్లి రాత్రి మంత్రగత్తె తన భర్తతో మీకు స్వచ్ఛమైన హృదయం ఉంది. మీ స్నేహితుడిని కాపాడడానికి మీకు మీరే త్యాగం చేశారు. కాబట్టి నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అంటుంది. ప్రతిరోజు నేను 12 గంటలు అందవికారంగా కనిపిస్తాను తర్వాతి 12 గంటలు చాలా అందంగా కనిపిస్తాను. ఇప్పుడు మీరు చెప్పండి మీరు ఏ రూపాన్ని అంగీకరించాలనుకుంటున్నారు అని అడిగింది. దానికి సిద్ధి రాజ్ అది మీ నిర్ణయం నేను నిన్ను నా భార్యగా అంగీకరించాను. కాబట్టి నీవు ఎలా ఉన్నా సరే అలాగే కోరుకుంటున్నాను అని బదులిచ్చాడు. ఇది విన్న మంత్రగత్తె అందంగా మారి మీరు నన్ను స్వయం నిర్ణయం తీసుకోవడానికి అనుమతించారు.
అందువల్ల ఇప్పటినుండి నేను ఎప్పుడూ అందంగానే ఉంటాను అని అన్నది. నిజానికి ఇదే నా నిజమైన రూపం. చుట్టుపక్కల ఉన్న అసహ్యమైన ప్రజల కోసం నేను నా రూపాన్ని అంద వికారమైన మంత్రగత్తెగా మార్చాను అని చెప్పింది. సామాజిక నిబంధనలు మహిళలను మగాడి మీద ఆధారపడేలా చేశాయి కానీ మానసికంగా ఏ స్త్రీ కూడా ఇతరుల మీద ఆధారపడటాన్ని అంగీకరించదు. అందువలన భార్యలకు స్వయం నిర్ణయాధికారం ఇచ్చిన గృహాలు సాధారణంగా సంతోషంగా ఉంటాయి. భార్యను ఇంటి అధిపతిగా ఉండడానికి మీరు అనుమతించకపోవచ్చు కానీ ఆమె జీవితంలో సగం మాత్రమే. మీరు మిగతా భాగాన్ని ఆ సగం బాగానైనా విడుదల చేయాలి. దీంతో ఆమె బహిరంగంగా ధైర్యంగా తన నిర్ణయాలు తీసుకోవచ్చు. తనకు ఒక మనసు ఉందని తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉందని గుర్తించాలి.
Today Gold Rate 13 January 2026 : ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం Today Gold price , వెండి…
Karthika Deepam 2 Today Episode : స్టార్ మా ప్రసారం చేస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ జనవరి…
Bhartha Mahasayulaki Wignyapthi : మాస్ మహారాజ రవితేజ కొత్త Mass Raviteja సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పై…
Chandrababu Sankranthi Kanuka : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. చేనేత…
Mahindra XUV 7 XO : భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రియమైన SUVలలో ఒకటిగా ఉన్న మహీంద్రా XUV700, ఇప్పుడు…
Mana Shankara Vara Prasad Garu Movie Collections : బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే అన్ని చోట్లా ఎక్స్‌లెంట్…
Goat Head Curry : మటన్ ప్రియులకు మేము మరొక ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేస్తున్నాం. మేక తలకాయ కూర.…
Zodiac Signs January 13 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…
This website uses cookies.