Sharwanand : బాలకృష్ణ టైటిల్ తో వస్తున్న శర్వానంద్.. సూపర్ హిట్ టైటిల్ పట్టేశాడుగా..!
ప్రధానాంశాలు:
Sharwanand : బాలకృష్ణ టైటిల్ తో వస్తున్న శర్వానంద్.. సూపర్ హిట్ టైటిల్ పట్టేశాడుగా..!
Sharwanand : యువ హీరో శర్వానంద్ నెక్స్ట్ సినిమాకు బాలకృష్ణ టైటిల్ ని లాక్ చేశారు. బాలయ్య సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన నారి నారి నడుమ మురారి సినిమా తెలిసిందే. ఇప్పుడు శర్వానంద్ ఇదే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. శ్రీవిష్ణుతో సామజవరగమన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ రాం అబ్బరాజ్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.
Sharwanand సినిమా రిజల్ట్ కూడా హీరోని..
ఈ సినిమాను ఏ కే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. శర్వానంద్ చివరి సినిమా మనమే. ఆ సినిమా రిజల్ట్ కూడా హీరోని నిరాశపరచింది. అందుకే ఈసారి సూపర్ హిట్ టైటిల్ తో వస్తున్నాడు. బాలయ్య టైటిల్ తో శర్వానంద్ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
నారి నారి నడుమ మురారి సినిమాలో శర్వానంద్ సరసన నటించే ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరన్నది చూడాలి. ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ త్వరలో రాబోతుంది. ఐతే టైటిల్ ఆల్రెడీ లీక్ అవ్వడంతో శర్వా సినిమాపై సూపర్ బజ్ ఏర్పడింది . Sharwanand, Balakrishna, Title, Nari Nari Naduma Murari, Tollywood