Shiva jyothi : రోల్ రైడా అలా.. శివజ్యోతి ఇలా.. ఏడిపించేశారుగా!
Shiva jyothi : మహిళా దినోత్సవం సందర్భంగా జీ తెలుగులో ఓ ఈవెంట్ రాబోతోంది. మగువా లోకానికి తెలుసా నీ విలువా అనే ఈ ఈవెంట్‌లో మహిళల గొప్పదనాన్ని చాట బోతోన్నారు. ఇందులో ఉదయభాను, శివజ్యోతి, ఇంకా రియల్ లైఫ్ ధీరవనితలను తీసుకొచ్చారు. లైన్ వుమెన్స్, డేరింగ్ పోలీస్ ఆఫీసర్, సింగర్ కనకవ్వ ఇలా చాలా మందినే పట్టుకొచ్చారు. ఇక ఈ అందరిలోనూ రోల్ రైడా ఇచ్చిన స్పీచ్, పాడిన ర్యాప్, శివజ్యోతి ఎమోషనల్ అయిన తీరు అందరినీ టచ్ చేశాయి.
Shiva jyothi : రోల్ రైడా అలా.. శివజ్యోతి ఇలా..
రోల్ రైడా తన ర్యాప్‌లతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఆమధ్య మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఓ ఆల్బమ్‌ను క్రియేట్ చేశాడు. అరుపు అంటూ రోల్ పాడిన ఆ ర్యాప్ పాట బాగానే ఎమోషనల్‌గా సాగింది. ఆ ఆల్బమ్ తీయడానికి గల కారణాలను చెప్పుకొచ్చాడు. ఓ చిన్న పిల్ల తన కజిన్ నోట్లో గుడ్డను పెట్టారు.. ఊపిరి ఆడకుండా చనిపోయింది.. అంటూ జరిగిన అఘాయిత్యం గురించిచెబుతూ అందరినీ ఏడిపించేశాడు.

Shiva jyothi and Roll Rida in Maguva Lokaniki Telusa Ni Viluva
ఇక శివజ్యోతి తన భర్త గురించి చెబుతూ బయట మాట్లాడుకునే కామెంట్లపై ఎమోషనల్ అయింది. భార్య సాఫ్ వేర్ ఉద్యోగం చేస్తుంటే.. భర్త కూర్చుని తింటున్నాడు.. వాడికేంటి అని అంటారు.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంటుంటారు.. కానీ మీరు అనుకున్నట్టుగా మా జీవితాలు ఉండవు.. మీరు అలా కామెంట్లు చేయడం వల్ల సపోర్ట్ చేసే వాళ్లను కిందపడేస్తున్నారు అంటూ శివజ్యోతి ఎమోషనల్ అయింది. స్టేజ్ మీదే కన్నీరు పెట్టేసుకుంది.
