Karthika Deepam : హిమ గురించి అన్ని నిజాలు శౌర్యకు చెప్పిన శోభ.. దీంతో హిమపై పగ తీర్చుకోవడానికి శౌర్య ఏం చేస్తుంది?

Authored By Varun G | The Telugu News | Updated on : 10 July 2022, 10:30 am

Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 11 జులై 2022, సోమవారం ఎపిసోడ్ 1401 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంద్రుడు, చంద్రమ్మకు జ్వాల ఎవరో అసలు నిజం తెలుస్తుంది. దీంతో తనను తన ఇంటికి వెళ్లొచ్చు కదా అని కోరుతారు. కానీ.. నేను వెళ్లను. నేను మీతోనే ఉంటాను అని తెగేసి చెబుతుంది జ్వాల. మరోవైపు తన పెళ్లి గురించే ఆలోచిస్తూ ఉంటాడు నిరుపమ్. తన పెళ్లికి మంచి క్యాటరింగ్ వాళ్లను చూడాలి అంటాడు. దీంతో స్వప్న ఏం మాట్లాడదు. తన ఆరోగ్యం గురించి ఆలోచించకు మమ్మీ. హిమకు మంచి ట్రీట్ మెంట్ ఇప్పిస్తాను. హిమ మీద ప్రేమతోనే ఇదంతా చేస్తున్నాను. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకో అని నిరుపమ్ చెప్పడంతో తనకు ఏం చేయాలో అర్థం కాదు.

shoba says truth to sourya about hima in karthika deepam

shoba says truth to sourya about hima in karthika deepam

నిరుపమ్ హిమను బతికించుకుంటా అంటున్నాడు. హిమ మీద ప్రేమతో చేస్తున్నా అంటున్నాడు. నిరుపమ్ చెప్పినట్టు జరిగితే హిమ పర్మినెంట్ గా నా కోడలు అయిపోతుంది. అలా జరగడానికి వీలు లేదు అని అనుకుంటుంది స్వప్న. మరోవైపు రాత్రి పూట ఆటో నడపడానికి బయలుదేరుతుంది జ్వాల. ఇంత తిని వెళ్లొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు బయటికి వెళ్లడం అని అడుగుతారు ఇంద్రుడు, చంద్రమ్మ. దీంతో ఏం వద్దు నేను వెళ్తానులే అని అంటుంది జ్వాల. డోర్ బయటికి వచ్చి చూసి షాక్ అవుతుంది జ్వాల. అక్కడ హిమ నిలబడి ఉంటుంది.

వర్షంతో తడిచి అక్కడే ఉంటుంది హిమ. నువ్వేంటి ఇంటికి వెళ్లకుండా అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా అంటే అవును అంటుంది హిమ. దీంతో తనను కోప్పడుతుంది జ్వాల. ఇలా ఇంటి ముందు వర్షంలో తడుస్తూ నిలబడితే జాలిపడతాను అనుకుంటున్నావా.. వెళ్లిపో అంటుంది జ్వాల.

Karthika Deepam : హిమను తన ఇంటి దగ్గర వదిలి వెళ్లిన జ్వాల

ఎంత చెప్పినా వినకుండా వద్దు నేను చెప్పేది విను అని హిమ అనేసరికి తప్పని పరిస్థితుల్లో తనను అక్కడి నుంచి తన ఇంటికి కారులో తీసుకెళ్తుంది. ఇంటికి తీసుకెళ్లాక.. ఒకసారి ఇంటికి రా అని అడుగుతుంది హిమ. కానీ.. అస్సలు ఇంటికి రాదు. నేను రాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్వాల.

మరోవైపు జ్వాలను కలుస్తుంది శోభ. నువ్వే అసలు శౌర్యవని హిమకు ఎప్పుడు తెలుసో తెలుసా? బ్లడ్ డొనేషన్ క్యాంప్ లోనే తెలిసిపోయింది. అసలు రహస్యం ఇంకొకటి ఉంది. నువ్వు మీ డాక్టర్ సాబ్ ను ప్రేమిస్తున్నావని తెలిశాక ఒక అద్భుతమైన ప్లాన్ వేసింది. తనకు క్యాన్సర్ ఉందని చెప్పింది అంటుంది శోభ.

దీంతో తన మాటలు నమ్మదు జ్వాల. రెండు నెలల కంటే ఎక్కువ బతకనని చెప్పి అందరినీ నమ్మించి డాక్టర్ సాబ్ ను ఒప్పించి తన పెళ్లి సెట్ చేసుకుంది అంటుంది శోభ. దీంతో కోపంతో తన చెంప చెళ్లుమనిపిస్తుంది జ్వాల. ఆ తర్వాత తనకు జ్వరం వస్తుంది. దీంతో హిమను పిలుస్తారు ఇంద్రుడు, చంద్రమ్మ. నేను మోసపోయాను అని నిద్రలోనే కలవరిస్తూ ఉంటుంది జ్వాల. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి