Shraddha Kapoor : మ‌రో బ్రేక‌ప్.. ప్రియుడితో రిలేష‌న్ క‌ట్ చేసిన శ్రద్ధా కపూర్

Authored By Sam C | The Telugu News | Published on: March 25, 2022, 9:30 pm

Shraddha Kapoor : శ్రద్ధా కపూర్ ..ఈ అమ్మ‌డి గురించి ఎంత పొగిడిన త‌క్కువ‌. ఎప్ప‌టిక‌ప్పుడు సన్నజాజి పువ్వులాంటి అందాలతో కనువిందు చేస్తుంది. బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు శక్తి కపూర్‌ తనయగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన శ్రద్ధా కపూర్‌ ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని, స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా `ఆషిఖి2` చిత్రంతో ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయింది శ్రద్ధా. ఈ రొమాంటికల్‌ మ్యూజికల్‌ డ్రామాలో శ్రద్ధా లవర్‌గా అద్భుతమైన నటనతో మెస్మరైజ్‌ చేసింది. ఘాటైన అందాలతో పిచ్చెక్కించింది. ఈ ఒక్క సినిమాతోనే బాలీవుడ్‌ యూత్‌ని తనవైపు తిప్పుకుంది శ్రద్ధా.

`ఏక్‌ విలన్‌`, `హైదర్‌`, `ఏబీసీడీ2` చిత్రాలతో శ్రద్ధా కపూర్‌ రేంజే మారిపోయింది. స్టార్‌ హీరోయిన్‌ అనే ట్యాగ్‌ని తగిలించుకుంది. బాలీవుడ్‌లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. మరోవైపు `బాఘి` చిత్రంలో టైగర్‌ ష్రాఫ్‌తో జోడి కట్టి రియల్‌ లైఫ్‌లోనూ లవర్స్ గా మారిపోయారనే టాక్‌ వినిపించింది. కానీ అది నిజం కాదనే విషయాన్ని దిశా పటానీ ఎంట్రీతో క్లారిటీ వచ్చేసింది. నటిగా తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది శ్రద్ధాకపూర్‌. అందుకు `హసీనా పార్కర్‌`, `స్త్రీ` చిత్రాలు ఉదాహరణగా నిలిచాయి. తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ఈ భామ `సాహో` చిత్రంలో నటించింది.

shraddha kapoor breakup with her lover

shraddha kapoor breakup with her lover

Shraddha Kapoor : బ్రేక‌ప్ చెప్పిన‌ట్టేనా..!

ఇటీవల `చిచ్చోర్‌`, `స్ట్రీట్‌ డాన్సర్‌ 3డీ`, `బాఘి3` చిత్రాల్లో నటించి విజయాలను అందుకుంది. కానీ నెక్ట్స్ సినిమాల విషయంలో గ్యాప్‌ ఇచ్చింది శ్రద్ధా. ప్రస్తుతం ఆమె కేవలం లవ్‌ రంజన్‌ చిత్రంలో నటిస్తుంది. అయితే కొద్ది రోజులుగా ప్రముఖ ఫోటోగ్రాఫర్ అయిన రోహన్ శ్రేష్ఠతో గత నాలుగేళ్ళుగా డేటింగ్‌‌లో ఉంది శ్రద్ధాకపూర్. ఇప్పుడు అతనికి బ్రేకప్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇటీవల గోవాలో జరిగిన శ్రద్ధా బర్త్ డే పార్టీలో రోహన్ ఎక్కడ కనిపించలేదు. దీనితో వీరిద్దరూ విడిపోయారన్న వార్తలకి బలం చేకూరుతోంది. వీరిద్దరూ కొంతకాలంగా ఆన్‌ అండ్‌ ఆఫ్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని తెలుస్తోంది.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp