Shriya Saran : డబ్బు కోసమే సొంత భర్తతో అలాంటి పనికి ఒప్పుకున్న శ్రియ.. వామ్మో రచ్చ మామూలుగా లేదు

 Authored By kranthi | The Telugu News | Updated on :3 January 2023,11:00 am

Shriya Saran : శ్రియ శరణ్ తెలుసు కదా. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. దాదాపు 20 ఏళ్ల కింద తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ భామ.. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులోని అగ్ర హీరోలు అందరితోనూ ఆడిపాడింది ఈ భామ. వరుసగా తను నటించిన సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో తనకు తిరుగే లేకుండా పోయింది.

అయితే.. తన కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడే సడెన్ గా పెళ్లి చేసుకొని వెండి తెరకు దూరం అయింది. రెండు దశాబ్దాల పాటు వెండి తెరను ఏలింది శ్రియ. తనకు మూడు పదుల వయసు దాటినా కూడా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. శ్రియ ఇప్పటికే ఒక కూతురుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే.. పెళ్లి అయిన తర్వాత తను ఎక్కువగా తన భర్తతో రొమాన్స్ చేస్తూ కనిపించేది.

Shriya Saran to introduce her huband in cinema

Shriya Saran to introduce her huband in cinema

Shriya Saran : పర్ ఫ్యూమ్ యాడ్ కోసం తన భర్తతోనే కలిసి రొమాన్స్ చేయబోతున్న శ్రియ

తన భర్తతో రొమాన్స్ చేసే ఫోటోలు, వీడియోలను శ్రియ ఎక్కువగా షేర్ చేసింది. అయితే.. తన భర్తను కూడా సినిమాల్లోకి తీసుకురావాలని శ్రియ భావిస్తోందట. ఓ పర్ ఫ్యూమ్ యాడ్ కోసం తన భర్తతోనే కలిసి శ్రియ రొమాన్స్ చేయబోతోంది. అది పర్ ఫ్యూమ్ యాడ్ కావడం వల్ల.. రొమాంటిక్ మూడ్ లో ఈ కపుల్ నటించబోతున్నారు. ఇద్దరూ నిజంగానే భార్యాభర్తలు. అయినా కూడా ఆన్ స్క్రీన్ లోనూ రొమాన్స్ చేసి తన అభిమానులను శ్రియ అలరించబోతోంది. మరి.. యాడ్ లో తన భర్త అండ్రూ ఎలా రెచ్చిపోతాడో వేచి చూడాల్సిందే.

kranthi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి