Intinti Gruhalakshmi : మళ్లీ తన అసలు రూపాన్ని బయటపెట్టిన లాస్య.. శృతిపై సీరియస్.. తులసి ముడుపులో రాసి ఉన్నది చూసి సామ్రాట్ షాక్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Intinti Gruhalakshmi : మళ్లీ తన అసలు రూపాన్ని బయటపెట్టిన లాస్య.. శృతిపై సీరియస్.. తులసి ముడుపులో రాసి ఉన్నది చూసి సామ్రాట్ షాక్

Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. ఇంటింటి గృహలక్ష్మి 12 డిసెంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 812 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హనీ అడిగిన దానికి ఏం చేయాలో అర్థం కాదు సామ్రాట్ కు. బారం దేవుడి మీదికి నెట్టేసినా ఏం చేయాలో సామ్రాట్ కు అస్సలు అర్థం కాదు. నాకు ఎలాగైనా ఫస్ట్ ర్యాంక్ వచ్చి తీరాలి. లేకపోతే నేను […]

 Authored By gatla | The Telugu News | Updated on :11 December 2022,9:30 am

Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. ఇంటింటి గృహలక్ష్మి 12 డిసెంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 812 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హనీ అడిగిన దానికి ఏం చేయాలో అర్థం కాదు సామ్రాట్ కు. బారం దేవుడి మీదికి నెట్టేసినా ఏం చేయాలో సామ్రాట్ కు అస్సలు అర్థం కాదు. నాకు ఎలాగైనా ఫస్ట్ ర్యాంక్ వచ్చి తీరాలి. లేకపోతే నేను ఇక స్కూల్ కు వెళ్లను. ఎగ్జామ్స్ రాయను అంటుంది హనీ. దీంతో అంత టెన్షన్ ఎందుకు. నేను చూసుకుంటాను. ఇక నువ్వు వెళ్లి పడుకోపో అంటాడు సామ్రాట్. దీంతో థాంక్యూ నాన్న అంటుంది హనీ. కానీ.. సామ్రాట్ కు ఏం చేయాలో అర్థం కాదు.

shruthi gets upset as lasya insults her in intinti gruhalakshmi

shruthi gets upset as lasya insults her in intinti gruhalakshmi

మరోవైపు తులసి.. వాళ్ల అమ్మ సరస్వతి ఇంటికి వెళ్తుంది. తనకు ఇష్టమైన జీడిపప్పు ఉప్మాను తీసుకెళ్లి తినిపిస్తుంది. నువ్వు చేసిందేమీ బాగోలేదు అంటుంది సరస్వతి. దీంతో ఉప్మా గురించా అని అడుగుతుంది. కాదు.. నీ గురించి అంటుంది. ఉప్మా అంటే మళ్లీ చేయొచ్చు కానీ.. నన్ను నేను రిపేర్ చేసుకోవడం మాత్రం కుదరదు అంటుంది. ఆ తర్వాత సరిగ్గా కూర్చో ఒడిలో పడుకోవాలి అని చెప్పి తన తల్లి ఒడిలో పడుకుంటుంది తులసి. 9 నెలలు ఎదిగే దాకా అమ్మ తన బిడ్డను కడుపులో దాచుకుంటుంది. ఆ తర్వాత ఆ బిడ్డ అమ్మ ఒడిలో తలదాచుకుంటుంది. బాధలో ఉన్నప్పుడు ఎవ్వరూ ఇవ్వలేని ఓదార్పును కేవలం అమ్మ ఒడి మాత్రమే ఇస్తుంది.. అని అంటుంది తులసి.

ఇంతలో సామ్రాట్ వస్తాడు. ఇక మీరు లేవాల్సిందే.. అంటాడు. ఆంటీ.. మీరు ఏం అనుకోనంటే మీ అమ్మాయి గురించి ఒక మాట చెబుతాను అంటాడు. ఈ పెద్దమనిషి బయట మాకు ఎన్నో సూక్తులు చెబుతుంటారు. కానీ.. ఇంట్లోకి వచ్చి చూస్తే చిన్నపిల్లల కంటే అన్యాయంగా ఎప్పుడూ అమ్మ ఒడిలోనే ఉంటారు అంటాడు సామ్రాట్.

ఆ తర్వాత ఇద్దరూ కారులో ఆఫీసుకు బయలుదేరుతారు. కానీ.. సామ్రాట్ ఎందుకో మూడీగా ఉన్నాడని అనుకొని ఏమైందో తెలుసుకోవడం కోసం కారు ఆపండి అంటుంది తులసి. ఎందుకు అన్నా కూడా వినదు. దీంతో కారు ఆపుతాడు సామ్రాట్.

Intinti Gruhalakshmi : హనీ విషయం తులసికి చెప్పిన సామ్రాట్

అసలు మీరు ఇంత పరధ్యానంగా ఎందుకు కారు డ్రైవ్ చేస్తున్నారు అంటూ ప్రశ్నిస్తుంది తులసి. దీంతో సామ్రాట్ కు ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు చెప్పండి.. మీ మనసు ఎక్కడుంది అని. దీంతో అది పెద్ద కథ అంటాడు సామ్రాట్.

దీంతో షార్ట్ ఫిలింలా క్లుప్తంగా చెప్పండి అంటుంది తులసి. దీంతో మనిషికి ఈ నాలుక ఉంది చూశారూ చాలా డేంజర్ అంటాడు. ఎక్కడో ఒకచోట అది ఇరికించేస్తుంది. ఆ తర్వాత లాక్కోలేక పీక్కోలేక చావాలి అంటాడు సామ్రాట్.

తను ఎప్పుడు ఎగ్జామ్స్ రాసినా సెకండ్ ర్యాంకే వస్తుంది. కానీ.. ఎప్పుడూ ఫస్ట్ ర్యాంక్ రావడం లేదని హనీ ముడుచుకొని పడుకుంది. దీంతో నేనే దేవుడు డిసైడ్ చేస్తాడు అని చెప్పేసరికి.. అయితే.. రేపు నాకు ఫస్ట్ ర్యాంక్ రావాల్సిందే అని దేవుడిని వేడుకో అని నాకు చెప్పింది అంటాడు సామ్రాట్.

మీరు చెప్పిన ప్రకారం ఫస్ట్ ర్యాంక్ రాకపోతే హనీ మీ చెంపలు వాయిస్తుంది అంటుంది తులసి. మీ సమస్యకు పరిష్కారం దొరికాకే కదులుదాం అంటుంది తులసి. ఏదో ఒకటి మీరు అయితే అన్నారు కదా. మీ మాటకు కట్టుబడి ఉండండి. దేవుడి మీద భారం వేయండి అంటుంది తులసి.

కట్ చేస్తే శృతి.. కిచెన్ లో ఏదో వండుతుంటే వెళ్లి లాస్య అడుగుతుంది. దీంతో వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. ప్రేమ్ అడిగాడు అని చెబుతుంది శృతి. కొంగు బిగించి అందుకే రంగంలోకి దిగావా అంటుంది లాస్య.

గుత్తి వంకాయ కావాలని అభి అడిగితే.. వేడి వేడిగా గారెలు కావాలని మా ఆయన కూడా అడిగితే.. ఇలా ఎవరికి వారు వాళ్లకు నచ్చినట్టుగా వండుకోవడానికి ఇదేమన్నా రెస్టారెంటా? అని శృతిని ప్రశ్నిస్తుంది.

ఇప్పటికే అన్నీ వండేశాం కదా.. ఈ కోరికలు ఏంటి అని అంటుంది. ఆయనేమన్నా లక్షలు సంపాదిస్తున్నాడా? కూర్చోబెట్టి ఆయనకు పెట్టడానికి. ఏం చేయాలన్నా ముందు నన్ను అడగాలి. ఎందుకంటే ఇది నా ఇల్లు అంటుంది లాస్య.

కట్ చేస్తే ఓ టెంపుల్ దగ్గర కారును ఆపుతాడు సామ్రాట్. దేవుడి మీద భారం వేయమన్నారు కదా.. అందుకే దేవుడి మీద భారం వేసేందుకు గుడికి వచ్చాను అంటాడు. ఇద్దరూ కలిసి ముడుపులు రాస్తారు.

మీరు ఏం రాశారు ముడుపులలో అని అడుగుతాడు సామ్రాట్. దీంతో చెప్పకూడదు అంటుంది తులసి. తను ముడుపు కట్టాక.. దాన్ని విప్పి చూడబోతాడు సామ్రాట్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది