శృతి హాసన్ ఇకపై కూడా అలాంటి పాత్రలు చేస్తానంటోంది ఫ్యాన్స్ ఒప్పుకుంటారా ..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

శృతి హాసన్ ఇక పై కూడా అలాంటి పాత్రలు చేస్తానంటోంది ఫ్యాన్స్ ఒప్పుకుంటారా ..?

శృతి హాసన్ దాదాపు మూడేళ్ళ తర్వాత టాలీవుడ్ లో దర్శనమిచ్చింది. మాస్ మహారాజ రవితేజ క్రాక్ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మీద ముందు నుంచి సంగతి తెల్సిందే. రవితేజ – గోపీచంద్ మలినేని – శృతి హాసన్ చాలా నమ్మకంగా ఉన్నారు. వాళ్ళ నమ్మకం వమ్ము కాలేదు. క్రాక్ సినిమా భారీ కమర్షియల్ హిట్ అన్న టాక్ తెచ్చుకొని సక్సస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇంకా సంక్రాంతి పండుగ రానేలేదు. […]

 Authored By govind | The Telugu News | Updated on :12 January 2021,4:09 pm

శృతి హాసన్ దాదాపు మూడేళ్ళ తర్వాత టాలీవుడ్ లో దర్శనమిచ్చింది. మాస్ మహారాజ రవితేజ క్రాక్ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మీద ముందు నుంచి సంగతి తెల్సిందే. రవితేజ – గోపీచంద్ మలినేని – శృతి హాసన్ చాలా నమ్మకంగా ఉన్నారు. వాళ్ళ నమ్మకం వమ్ము కాలేదు. క్రాక్ సినిమా భారీ కమర్షియల్ హిట్ అన్న టాక్ తెచ్చుకొని సక్సస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇంకా సంక్రాంతి పండుగ రానేలేదు. బరిలో దిగాల్సిన సినిమాలు కూడా ఇంకా రిలీజ్ కాలేదు. కాని క్రాక్ సినిమానే సంక్రాంతి విన్నర్ అని బ్లైండ్ గా డిసైడవుతున్నారు.

Ravi Teja and Shruti Haasan wrap up shooting for Sankranti release 'Krack'  | The News Minute

కాగా మూడేళ్ళ తర్వాత వచ్చిన క్రాక్ సినిమా సక్సస్ తో శృతి హాసన్ ఉబ్బి తబ్బిబ్బవుతోంది. తాజాగా తన ఆనందాన్ని పంచుకుంది శృతి హాసన్. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంది. శృతి హాసన్ ఈ సినిమాలో తల్లి పాత్రలో నటించింది. వాస్తవంగా అయితే శృతి హాసన్ ఇప్పుడే ఇలాంటి పాత్రలు చేయాల్సిన అవసరం లేదు. కాని కథ.. అందులో పాత్ర డిమాండ్ చేసింది కాబట్టి సంతోషంగా నటించింది. అంతేకాదు క్రాక్ సినిమాలో పోషించిన పాత్రకి గాను ప్రశంసలు అందుకుంటోంది.

Ravi Teja, Shruti Haasan share new 'Krack' poster on Makar Sankranti

ఇకపై కూడా శృతి హాసన్ హాసన్ తల్లి పాత్రలు వస్తే నటిస్తానని చెప్పుకొచ్చింది. అయితే శృతి హాసన్ ఫ్యాన్స్ కి మాత్రం ఈ మాట డైజెస్ట్ కావడం లేదట. కాగా శృతి హాసన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమా కూడా చేసింది. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలని జరుపుకుంటుండగా ఏప్రిల్ 9 న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బలుపు, డాన్ శీను తర్వాత రవితేజ – గోపీచంద్ మలినేని క్రాక్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ సాధించారు.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది