Shruti Haasan : స‌మంత‌ని ఫాలో అయిన శృతి హాసన్.. కొత్త బాయ్ ఫ్రెండ్‌తో కూడా దోస్తీ క‌ట్..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Shruti Haasan : స‌మంత‌ని ఫాలో అయిన శృతి హాసన్.. కొత్త బాయ్ ఫ్రెండ్‌తో కూడా దోస్తీ క‌ట్..!

Shruti Haasan : ఇటీవ‌ల ప్రేమలు, బ్రేక‌ప్‌లు స‌హ‌జంగా మారాయి. ఇంతకు ముందు బాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగిన బ్రేకప్ కహానీలు గమనిస్తే… లవ్ చేసుకునేటప్పుడు ఒకరినొకరు ఫాలో అవ్వడంతో పాటు విపరీతంగా పోస్టులు చేసుకునే వారు. అయితే బ్రేకప్ అయ్యాక అన్ ఫాలో అవ్వడం కామన్ థింగ్ గా మారింది. విడాకుల విషయం అనౌన్స్ చెయ్యడానికి ముందు నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ సైతం ఒకరినొకరు అన్ ఫాలో అయ్యారు. ఇక నాగ చైతన్యను సమంత అన్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :26 April 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Shruti Haasan : స‌మంత‌ని ఫాలో అయిన శృతి హాసన్.. కొత్త బాయ్ ఫ్రెండ్‌తో కూడా దోస్తీ క‌ట్..!

Shruti Haasan : ఇటీవ‌ల ప్రేమలు, బ్రేక‌ప్‌లు స‌హ‌జంగా మారాయి. ఇంతకు ముందు బాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగిన బ్రేకప్ కహానీలు గమనిస్తే… లవ్ చేసుకునేటప్పుడు ఒకరినొకరు ఫాలో అవ్వడంతో పాటు విపరీతంగా పోస్టులు చేసుకునే వారు. అయితే బ్రేకప్ అయ్యాక అన్ ఫాలో అవ్వడం కామన్ థింగ్ గా మారింది. విడాకుల విషయం అనౌన్స్ చెయ్యడానికి ముందు నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ సైతం ఒకరినొకరు అన్ ఫాలో అయ్యారు. ఇక నాగ చైతన్యను సమంత అన్ ఫాలో అయ్యింది. అదే విధంగా ఇప్పుడు శృతి, శాంతను అన్ ఫాలో అయ్యారని ముంబై ఇండస్ట్రీ జనాలు భావిస్తున్నారు. వారిద్ద‌రి రిలేష‌న్ బ్రేక్ అయింద‌ని చెప్పుకొస్తున్నారు.

Shruti Haasan : శృతి హాస‌న్ కి రెండో బ్రేక‌ప్

ఒక‌ప్పుడు లండ‌న్‌కి చెందిన వ్య‌క్తితో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్న శృతి హాస‌న్ కొన్నాళ్లకి అత‌ని నుండి విడిపోయి డూడుల్ ఆర్టిస్ట్ శాంత‌నుతో ప్రేమాయ‌ణం సాగించింది. ఇద్ద‌రు క‌లిసి తిర‌గడం, చెట్టా ప‌ట్టాలు వేసుకోవ‌డం, సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేయ‌డం మ‌నం చూశాం.కానీ గత కొన్ని రోజుల నుంచి వీళ్ళిద్దరూ కలిసి సోషల్ మీడియాలో సందడి చేయడం మానేశారు. దీంతో అసలు మేటర్ ఏంటా అని ఆరా తీస్తే.. శాంతను, శృతి హాసన్ మధ్య బ్రేకప్ జరిగిందని తెలుస్తోంది. నిన్న మొన్నటిదాకా ఇద్దరూ కలిసి సోషల్ మీడియాలో హల్చల్ చేయగా, తాజాగా చూస్తే శృతి హాసన్ శాంతను హాజరికను ఫాలో అవ్వడం లేదు. అతను కూడా శృతిని ఇన్స్టాలో అన్ ఫాలో చేయడం విశేషం. ఇలా ఇద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో చేయడంతో ఇద్ద‌రి మ‌ధ్య బ్రేక‌ప్ జ‌రిగింద‌ని అంటున్నారు.

Shruti Haasan స‌మంత‌ని ఫాలో అయిన శృతి హాసన్ కొత్త బాయ్ ఫ్రెండ్‌తో కూడా దోస్తీ క‌ట్

Shruti Haasan : స‌మంత‌ని ఫాలో అయిన శృతి హాసన్.. కొత్త బాయ్ ఫ్రెండ్‌తో కూడా దోస్తీ క‌ట్..!

మరోవైపు శృతి హాసన్ ఏకంగా తన సోషల్ మీడియా ఖాతాల నుంచి శాంతనుతో దిగిన ఫోటోలను డిలీట్ చేసి పారేసింది.ఈ ప‌రిణామాలు చూస్తుంటే వారిద్ద‌రు విడిపోయారని,దీనిపై ఏదైన అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేస్తారా అని ముచ్చ‌టించుకుంటున్న‌రు. శృతి హాసన్ కు ఇది సెకండ్ బ్రేకప్. ఇంతకు ముందు ఇటాలియన్ యాక్టర్ మైఖేల్ కోర్స్ లేతో కొన్ని నెలలు డేటింగ్ చేశాక అతడితో విడిపోయింది. ఇక కెరీర్ విష‌యానికి వ‌స్తే ‘సలార్ 1’తో గత ఏడాది భారీ బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్న శృతి హాస‌న్ ఇప్పుడు ‘సలార్ 2’ షూటింగ్ చెయ్యడానికి రెడీ అవుతోంది. ఇది కాకుండా అడివి శేష్ జంటగా ‘డెకాయిట్’ సినిమా చేస్తోంది. కన్నడ స్టార్ యశ్ ‘టాక్సిక్’, సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ‘కూలి’ సినిమాల్లోనూ శృతి క‌థానాయిక‌గా ఎంపికైందని టాక్.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది