Shruti Hassan : తన కొత్త లవర్ ఎవరో చెప్పేసిన శృతి హాసన్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shruti Hassan : తన కొత్త లవర్ ఎవరో చెప్పేసిన శృతి హాసన్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్..?

 Authored By mallesh | The Telugu News | Updated on :10 January 2022,12:35 pm

Shruti Hassan : భారతదేశం గర్వించదగ్గ నటుల్లో కమల్ హాసన్ ఒకరు.. ఆయన కేవలం నటుడిగానే కాకుండా నిర్మాత కమ్ దర్శకుడిగాను తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఇండస్ట్రీలో నేటికీ ఆయన ప్రస్థానం కొనసాగుతోంది. తన యాక్టింగ్ స్కిల్‌తో తిమ్మిని బమ్మి చేయగల సత్తా ఆయన సొంతం. అయితే, అతని పర్సనల్ లైఫ్ మాత్రం కొంత కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. రెండు పెళ్లిళ్లు చేసుకున్న కమల్ చాలా మంది సీనియర్ హీరోయిన్లతో డేటింగ్ చేశారని అప్పట్లో జోరుగా వార్తలొచ్చాయి. కమల్ హాసన్‌కు ఇద్దరు సంతానం. పెద్ద కూతురు శృతిహాసన్, చిన్న కూతురు అక్షరా హాసన్..

అక్కాచెల్లెళ్లు ఇద్దరు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. శృతి హాసన్ కూడా మంచి యాక్టర్ , సింగర్, డ్యాన్సర్. తండ్రి లాగే మల్టీ టాలెంటెడ్. మొన్నటివరకు వరుస సినిమాలతో జోరుమీదున్న శృతి ఆ మధ్య కొంచెం డిస్టప్ అయ్యిందట.. దానికి కారణం లవ్ ఫెల్యూర్ అని చెప్పుకొచ్చింది. ఆ మధ్య‌ ఇంగ్లాండ్ సింగర్ మైకేల్ కోర్సులేతో పీకల్లోతూ లవ్‌లో ఉన్న శృతి అతన్ని పెళ్లి చేసుకుంటుందని అంతా భావించారు. అతనితో తిరుగుతూ సినిమాలకు దూరం అయ్యింది. తీరా అది పెళ్ళివరకు వెళ్ళకుండా మధ్యలోనే బ్రేకప్ అయ్యింది.

shruti hassan tells her new lover

shruti hassan tells her new lover

Shruti Hassan : నా బాయ్ ఫ్రెండ్ ఇతగాడే

ఈ ఇష్యూ వలన శృతి మద్యానికి అలవాటై కొంత కాలం డిప్రెషన్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే క్రాక్ సినిమా ఆఫర్ రావడంతో అందులో బిజీగా మారిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. తిరిగి వేగంగా సినిమాలు చేస్తోంది. ఈక్రమంలోనే ఈ పొడుగు కాళ్ల సుందరి ప్రస్తుతం శాంతను హజరికా అనే ఆర్టిస్ట్‌తో మరోసారి ప్రేమలో పడిందట.. ఇస్ స్టా వేదికగా వీరిద్దరూ క్విచ్ నిర్వహించగా.. తానే ముందు ఐలవ్ వ్యూ చెప్పినట్టు శృతి ఒప్పుకుంది. ఇక ఇద్దరు కేరింగ్ గా ఉంటారని, శృతి క్లీనింగ్ విషయంలో బెస్ట్ అని, తిండి విషయంలో హజరికా బెస్ట్ అంటూ రాసుకొచ్చారట.. వీరి సంభాషణను అక్షర హాసన్ లైక్ చేసినట్టు తెలిసింది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది