Ankitha : సింహాద్రి హీరోయిన్ అంకిత గుర్తుందా… ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ankitha : సింహాద్రి హీరోయిన్ అంకిత గుర్తుందా… ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు…

 Authored By aruna | The Telugu News | Updated on :29 July 2022,1:00 pm

Ankitha : సినిమా పరిశ్రమలో హీరోలకు యాభై,అరవై ఏళ్లు వచ్చిన సినీ మాలో కొనసాగుతుంటారు. కానీ హీరోయిన్లు మాత్రం 30 దాటిందంటే తెరపై కనిపించడం కష్టమే. ఒకవేళ ఉన్నారు అంటే హీరోయిన్లకు గాని హీరోలకు గాని అక్క వదిన పాత్రల్లో నటించాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో రాణిస్తున్న హీరోల కెరీర్ ప్రారంభంలో నటించిన చాలామంది హీరోయిన్లు ఇప్పటికే హీరోయిన్ పాత్రలకు వీడ్కోలు చెప్పేశారు. ఇక వారిలో కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తున్నారు. మరికొందరు వివాహం చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలా సినిమాలకు దూరమైన వారిలో ఒకరే ఎన్టీఆర్ హీరోయిన్ అంకిత.

అంకిత మొదటిసారి టాలీవుడ్ లో ‘ లాహిరి లాహిరి లాహిరిలో ‘ సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అంకిత వరుస సినిమాలను అందుకుంది. ఈ సినిమా సక్సెస్ తర్వాత అంకిత రాజమౌళి దర్శకత్వంలో ‘ సింహాద్రి ‘ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమాలో భూమిక మొదటి హీరోయిన్ గా నటించగా అంకిత సెకండ్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత అంకిత ఇక తిరిగి చూసుకోలేదు. వరుసగా విజయేంద్ర వర్మ, స్టేట్ రౌడీ, వినాయకుడు, సీతారాముడు లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అప్పట్లో ఈ అమ్మడు గ్రామర్ డోస్ కూడా మిగతా హీరోయిన్ల కంటే ఎక్కువగా ఉండటంతో కుర్రాళ్లకు ఇష్టమైన హీరోయిన్ గా మారిపోయింది.

Simhadri heroine Ankitha latest pics

Simhadri heroine Ankitha latest pics

తర్వాతి సినిమాలన్నీ నిరాశపరచడంతో అంకిత చిన్నగా సినిమాలకు దూరమైపోయారు. ఆ తర్వాత పూణెకు చెందిన విశాల్ ఝాటక్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత వీరిద్దరికీ ఓ బాబు జన్మించాడు. దాంతో ఫ్యామిలీ లైఫ్ లో బిజీ అయిపోయింది. అంతేకాకుండా అంకిత ఇప్పుడు వజ్రాల వ్యాపారం చేస్తుంది. తన తండ్రికి చెందిన వజ్రాల వ్యాపారాన్ని అంకిత నడిపిస్తుంది. అయితే ఈమధ్య తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అంకిత అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది అని చూసినవాళ్లంతా అనుకుంటున్నారు.

Simhadri heroine Ankitha latest pics

Simhadri heroine Ankitha latest pics

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది