Singanamala Ramesh Babu : పవన్, మహేష్ వల్ల వంద కోట్ల నష్టం.. నిర్మాత శింగనమల రమేష్ సంచలన ప్రెస్ మీట్..!
ప్రధానాంశాలు:
Singanamala Ramesh Babu : పవన్, మహేష్ వల్ల వంద కోట్ల నష్టం.. నిర్మాత శింగనమల రమేష్ ప్రెస్ మీట్..!
Singanamala Ramesh Babu : Pawan Kalyan పవన్ కళ్యాణ్, మహేష్ Mahesh Babu లతో సినిమాలు చేసిన నిర్మాత శింగనమల రమేష్ బాబు Singanamala Ramesh Babu ఆఫ్టర్ లాంగ్ టైం మీడియా ముందుకు వచ్చారు. ప్రెస్ మీట్ పెట్టి విధి వంచనకి తల వంచని ధైర్యం శింగనమల రమేష్ బాబు అనే మూమెంట్ తో మీడియాతో మాట్లాడారు.
Singanamala Ramesh Babu 100 కోట్ల నష్టం అయినా ఎవ్వరు కూడా..
ఈ క్రమంలో తన తండ్రి ఫైనాన్షియర్ గా చేస్తూ తనకు అది కుదిరిందని. ఐతే తను చాలా లాసులు ఫేస్ చేశానని అన్నారు శింగనమల రమేష్ Singanamala Ramesh Babu . అంతేకాదు స్టార్ హీరోల సినిమాల వల్ల తనకు 100 కోట్ల నష్టం వచ్చిందని అన్నారు. పవన్ కళ్యాణ్ తో కొమరం పులి, మహేష్ తో ఖలేజా సినిమాలు చేశారు శింగనమల రమేష్.
ఐతే ఆ రెండు సినిమాలు 3 ఏళ్లు తీశామని ప్రొడక్షన్ కాస్ట్ బాగా పెరగడం సినిమాలు ఫ్లాప్ అవ్వడం వల్ల 100 కోట్లు నష్ట పోయానని అన్నారు రమేష్. ఐతే తాను అంత నష్టపోయినా తనని కనీసం ఎవరు పట్టించుకున్న పాపాన లేదని ఆయన సంచలన కామెంట్స్ చేశారు. సడెన్ గా ఆయన ఇలా ప్రెస్ మీట్ పెట్టడం వెనక రీజన్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. జైల్ లో ఉన్నప్పుడు కూడా ఒక్క హీరో కూడా ఫోన్ చేయలేదని రమేష్ అన్నారు.