Mangli Marriage : బావతోనే పెళ్లి పై క్లారిటీ ఇచ్చేసిన మంగ్లీ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mangli Marriage : బావతోనే పెళ్లి పై క్లారిటీ ఇచ్చేసిన మంగ్లీ..!

 Authored By kranthi | The Telugu News | Updated on :5 October 2023,9:00 pm

Mangli Marriage : సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను ఎంత బాగా జానపద గేయాలు పాడుతుందో అందరికీ తెలుసు. బతుకమ్మ, బోనాలు, డివోషనల్, ఫోక్, సినిమా సాంగ్స్ కూడా అద్భుతంగా పాడటంలో దిట్ట. తను చాలా సినిమాల్లోనూ మాస్ సాంగ్స్ పాడింది. ఇక.. తెలంగాణకు సంబంధించిన జానపద గేయాలు పాడాలంటే సింగర్ మంగ్లీ తర్వాతే ఎవరైనా. తన గొంతు అంత బాగుంటుంది. ఇదంతా పక్కన పెడితే తన పెళ్లి విషయంపై చాలా రూమర్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నారు. ఆమె పెళ్లి వార్తలు కొద్ది రోజులుగా వైరల్ అవుతున్నాయి. ప్లే బ్యాక్ సింగర్ గా టాలీవుడ్ లోనూ తనదైన ముద్ర వేసుకున్న టాలెంటెండ్ సింగర్ మంగ్లీ త్వరలోనే తన బావతో పెళ్లి పీటలు ఎక్కబోతోంది అనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అందుకోసమే తను ఇప్పటి వరకు అంగీకరించిన ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో మంగ్లీ ఉందని ప్రచారం జరుగుతోంది. తాజాగా తన పెళ్లి రూమర్లపై స్పందించిన మంగ్లీ అసలు విషయం ఏంటో బయటపెట్టింది. మంగ్లీ పాటలకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. మంగ్లీ ఆలపించే బతుకమ్మ, బోనాల పాటలతో పాటు అన్ని పాటలకు మంచి ఆదరణ ఉంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా బిజీ సింగర్ గా మారిపోయింది. ఒక మామూలు పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి స్టార్ సింగర్ రేంజ్ కు తక్కువ కాలంలోనే చేరింది. శైలజా రెడ్డి అల్లుడు, నీదీ నాదీ ఒకే కథ, జార్జిరెడ్డి, అల వైకుంఠపురంలో, సీటీమార్, లవ్ స్టోరీ, రంగ్ దే, అల్లుడు అదుర్స్, క్రాక్, పెళ్లి సందడి, పుష్ప, రౌడీ బాయ్స్, దమాఖా, బలగం, బోళా శంకర్ లాంటి సినిమాల్లో మంగ్లీ పాడిన పాటలు పాపులర్ అయ్యాయి.

singer mangli clarity about her marriage

Mangli Marriage : బావతోనే పెళ్లి పై క్లారిటీ ఇచ్చేసిన మంగ్లీ..!

Mangli Marriage : తన బావతోనే పెళ్లి జరగబోతోందా?

తను త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని, ఆ పెళ్లి కూడా తన బావతోనే అని రూమర్లు తెగ షికారు చేస్తున్నాయి. అయితే.. తన పెళ్లి రూమర్లపై స్పందించిన మంగ్లీ తనలో తానే నవ్వుకుంది. ఎందుకంటే.. తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తేల్చేసింది. అలాగే వరుసకు బావ అయ్యే వ్యక్తిని పెళ్లి చేసుకుంటా అని అంటున్నారని, తనకు తెలియని బావ ఎక్కడి నుంచి వచ్చాడో అర్థం అవడం లేదని చెప్పుకొచ్చింది. నాకు కూడా తెలియకుండానే నా పెళ్లి చేస్తున్నారు. మంగ్లీ క్లారిటీ ఇవ్వడంతో తన పెళ్లి వార్తలకు పుల్ స్టాప్ పడినట్టే ఇక.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది